Site icon HashtagU Telugu

Bharat jodo yatra : తమ్ముడికి మద్దతుగా అక్క…తొలిసారిగా భారత్ జోడో యాత్రలో ప్రియాంకగాంధీ..!!

Priyanka Gandhi

Priyanka Gandhi

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇవాళ మధ్యప్రదేశ్ నుంచి ప్రారంభం కానుంది. ఈ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వారం నుంచి ఈ యాత్రలో తన సోదరుడికి మద్దతుగా పాల్గొనున్నారు. ఈ యాత్రలో తొలిసారిగా ప్రియాంకగాంధీ చేరనున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం…ప్రియాంక గాంధీ తన సోదరుడితో కలిసి నవంబర్ 23 నుంచి 25 వరకు యాత్రలో పాల్గొనున్నారు. ప్రజల్లోకి వెళ్తూ వారి సమస్యల గురించి ఆరా తీయనున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రియాంక గాంధీ పార్టీ ప్రచారంలో బిజీగా ఉండటంతో భారత్ జోడో యాత్రలో పాల్గొనలేకపోయిన సంగతి తెలిసిందే.

కాగా రాహుల్ చేపట్టిన ఈ యాత్ర ఇప్పటివరకు దాదాపు 3,570 కిలోమీటర్ల మేర సాగింది. ఈ యాత్రలో కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ప్రియాంక గాంధీ మధ్యప్రదేశ్ లో సాగే యాత్రలో రాహుల్ తో కలిసి నడవనున్నారు. ప్రస్తుతం రాహుల్ యాత్ర ఉజ్జయిని మహాకల్ నగరానికి చేరుకుంది.