Supreme Court Orders: కరోనా టైమ్ లో విడుదలైన ఖైదీలు మళ్లీ జైలుకు రావాలి.. సుప్రీంకోర్టు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సంగతి అందరికి తెలిసిందే. కరోనా తీవ్రంగా ఉన్ననాటి రోజులు గుర్తుకు వస్తే ఇప్పటికీ భయమే . కఠినమైన లాక్ డౌన్లు..

Supreme Court Orders: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సంగతి అందరికి తెలిసిందే. కరోనా తీవ్రంగా ఉన్ననాటి రోజులు గుర్తుకు వస్తే ఇప్పటికీ భయమే . కఠినమైన లాక్ డౌన్లు, సోషల్ డిస్టెన్స్, వ్యాక్సిన్ లతో మహమ్మారి బారి నుంచి ప్రపంచం బయటపడింది. మరోవైపు మన దేశంలో జైళ్లు కిక్కిరిసి పోయి ఉంటాయనే విషయం తెలిసిందే. దీంతో, జైళ్లలోని ఖైదీలు కరోనా బారిన పడకుండా.. అప్పట్లో తీవ్ర నేరాలు చేయని వారిని, విచారణ ఖైదీలను విడుదల చేశారు. అలాంటి ఖైదీలపై మళ్ళీ తాజాగా సుప్రీంకోర్టు (Supreme Court) స్పందించింది.

కరోనా సమయంలో విడుదలైన ఖైదీలందరూ 15 రోజుల్లో మళ్లీ జైళ్లకు రావాలని ఆదేశించింది. జైలుకు వచ్చిన తర్వాత మళ్లీ బెయిల్ కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. తమ శిక్షను రద్దు చేయాలని కోరుతూ సంబంధిత కోర్టుల్లో కూడా పిటిషన్ వేసుకోవచ్చని తెలిపింది. కరోనా సమయంలో సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలతో ఏర్పడిన అత్యున్నత కమిటీ సిఫారసుల మేరకు తీవ్ర నేరాలు చేయని వారిని, విచారణ ఖైదీలను అప్పుడు జైళ్ల నుంచి విడుదల చేశారు.

Also Read:  Mumbai Indians IPL: వారిద్దరూ లేకున్నా బలంగానే ముంబై.. తుది జట్టు కూర్పు ఇదే