Site icon HashtagU Telugu

PM Modi : వారణాసిలో నామినేషన్‌ వేసిన ప్రధాని మోడీ

Prime Minister Narendra Modi files nomination from Varanasi Lok Sabha seat

Prime Minister Narendra Modi files nomination from Varanasi Lok Sabha seat

Prime Minister Modi nominated: బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్రమోడీ నామినేషన్‌(Nomination) దాఖలు చేశారు. మంగళవారం ఉదయం వారణాసి కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకున్న ఆయన ఎన్నికల అధికారులకు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. నామినేషన్‌ కార్యాక్రమానికి మోడీ వెంట 18 మంది కేంద్ర మంత్రులు హాజరయ్యారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ సహా 12 రాష్ట్రాల సీఎం హాజరయ్యారు. పలువురు ఎన్డీఏ నేతలు, కేంద్ర మంత్రులు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

వరుసగామూడోసారి విజయం సాధించడమే లక్ష్యంగా మోడీ వారణాసి బరిలో దిగుతున్నారు. నామినేషన్ సందర్భంగా మోడీ మొదట గంగా తీరంలోని దశాశ్వమేథ్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగానదికి హారతి సమర్పించిన అనంతరం..పర్యాటక బోటులో గంగానదీ విహారం చేశారు. ఆ తర్వాత కాలభైరవుడి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

Read Also: TDP Tweet: కూట‌మిదే విజ‌యమా..? వైర‌ల్ అవుతున్న టీడీపీ ట్వీట్‌

అంతకుముందు మోడీ వారణాసి ప్రజలను ఉద్దేశించి ఓ వీడియో సందేశాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. కాశీ నగరంపై తనకున్న ప్రేమ, గంగానదితో ఏర్పడిన బంధం కాలక్రమంలో దృఢమవుతూ వచ్చిందని ఈ వీడియోలో మోదీ వెల్లడించారు. ”2014లో నేను కాశీకి వచ్చినప్పుడు.. గంగమ్మ(నది) నన్ను ఈ నగరానికి ఆహ్వానించినట్లు అనిపించింది. ఈ పదేళ్ల కాలం తర్వాత.. ఆ గంగమ్మ నన్ను దత్తత తీసుకుందని చెప్పగలను. ఈ సమయంలో కాశీతో నా బంధం దృఢంగా మారింది. ఇప్పుడు ఈ ప్రాంతం నాది. ఒక తల్లి, కుమారుడికి ఉన్న సాన్నిహిత్యానికి ఫీల్ అవుతున్నాను” అని అన్నారు.