Site icon HashtagU Telugu

The Kashmir Files: మోడీ మెచ్చిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’

Modi

Modi

మన తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ తొలి బాలీవుడ్ వెంచర్ `ది కాశ్మీర్ ఫైల్స్. ఈ చిత్రాన్ని నిర్మించినందుకు మన గౌరవప్రదమైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలు అందుకోవడం గొప్ప విశేషమే కాదు గ‌ర్వం కూడా. అవును. నిజం ఎందుకంటే కాశ్మీర్ తిరుగుబాటు సమయంలో కాశ్మీరీ హిందువుల వలసలను వర్ణించే చిత్రాన్ని రూపొందించడానికి సాహసించినందుకు వారిని ఆశీర్వదించాలని చిత్రనిర్మాతలకు ప్రధాని నుంచి పిలుపు వ‌చ్చింది. ప్ర‌ధానిని క‌లిసిన వారిలో వివేక్, అభిషేక్‌లతో పాటు నటి పల్లవి జోష్ కూడా వున్నారు.

నిర్మాత అభిషేక్ అగర్వాల్ తన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రధానిని సత్కరించారు. ప్రధానమంత్రి ఒక చిత్రాన్ని అభినందించ‌డం, అది టీమ్‌కి అద్భుతమైన ఫీట్‌గా తెలిపారు. మరోవైపు, అన్నిచోట్ల కాశ్మీర్ ఫైల్స్ పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ బిజినెస్ చేస్తోంది. మౌత్ టాక్‌తో మొదటి రోజు కంటే రెండోరోజు నుంచి ఆద‌ర‌ణ మ‌రింత‌గా పెరిగింది. ఈ సినిమా పై అన్ని ప్రాంతాల‌ నుండి వచ్చిన రెస్పాన్స్‌తో సంతోషించిన నిర్మాత అభిషేక్ అగర్వాల్ తన బ్యానర్‌లో కొన్ని ఆలోచనలను రేకెత్తించే, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను రూపొందించడానికి సిద్ధంగా ఉన్నారు.

Exit mobile version