Site icon HashtagU Telugu

PM Modi : ప్రధాని మోడీ చైనా టూర్..సరిహద్దుల్లో ఘర్షణ తర్వాత తొలిసారి పర్యటన!

Prime Minister Modi's China tour...first visit after border clashes!

Prime Minister Modi's China tour...first visit after border clashes!

PM MOdi : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ త్వరలో చైనాలో పర్యటించనున్నారని విశ్వసనీయ సమాచారం. షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్.సీ.ఓ) సదస్సు సందర్బంగా ఆయన చైనా పర్యటన జరగనుందని తెలుస్తోంది. ఈ సదస్సు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు తియాంజిన్ నగరంలో జరుగుతుంది. ఇందులో భారత ప్రధాని మోడీతో పాటు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తదితర ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ చైనాకు పర్యటనకు వెళ్లే అవకాశముందని అధికారులు తెలిపారు. ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ ప్రారంభంలో మోడీ బృందం చైనాకు వెళ్లే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ పర్యటనలో ద్వైపాక్షిక చర్చలకు అవకాశం ఉండనుంది. ముఖ్యంగా భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలు ప్రధాన చర్చాంశంగా ఉండొచ్చని సమాచారం.

Read Also: UIDAI : కీలక సూచన..ఏడేళ్ల లోపు పిల్లల ఆధార్‌కి బయోమెట్రిక్ అప్‌డేట్ తప్పనిసరి..తల్లిదండ్రులు జాగ్రత్త!

2020లో లడఖ్ ప్రాంతంలోని గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత ప్రధాని మోడీ చైనాలో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. గల్వాన్ ఘటనలో ఇరుదేశాల సైనికులు ప్రాణాలు కోల్పోవడం, తదనంతరం ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చైనా-భారత సంబంధాలు ప్రతికూల దిశలో సాగాయి. అయితే తాజాగా సంబంధాలను పునరుద్ధరించేందుకు చర్చలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో రెండు రోజుల క్రితం భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ బీజింగ్‌కు వెళ్లి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య తాజా పరిణామాలు, సరిహద్దు అంశాలపై ఇద్దరూ చర్చించారని సమాచారం. దీనిని కొనసాగింపుగానే మోడీ పర్యటననూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ తొలిసారిగా 2015లో చైనాలో పర్యటించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఐదు సార్లు చైనాలో పర్యటించారు. కానీ 2020 ఘర్షణ అనంతరం మోడీ చైనా పర్యటనను విరమించారు. తాజా పర్యటనతో రెండు దేశాల మధ్య సంబంధాల్లో కొత్త మలుపు వచ్చే అవకాశం ఉంది. ఎస్.సీ.ఓ సదస్సు లో భాగంగా ద్వైపాక్షిక భేటీలతో పాటు బహుపాక్షిక చర్చలు కూడా జరిగే అవకాశముంది. పశ్చిమాసియా ప్రాంతంలో స్థిరత్వం, ఉగ్రవాద నిర్మూలన, వాణిజ్య సహకారం తదితర అంశాలపై సభ్యదేశాలు మంత్రిత్వస్థాయిలో సమావేశమవుతాయి. ఈ పర్యటన మోడీ ప్రభుత్వ విదేశాంగ విధానంలో మరో కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ద్వైపాక్షిక చర్చలు ఫలప్రదమైతే, ఇది భారత-చైనా సంబంధాల మళ్లీ మైనదారిలోకి వచ్చే సూచనగా కూడా పరిగణించవచ్చు.

Read Also: ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌.. టాప్ బ్యాట్స్‌మెన్ ఎవ‌రో తెలుసా?