PM Modi : ఢిల్లీలో రైతుల ఆందోళనలు..తొలిసారిగా స్పందించిన ప్రధాని మోడీ

  • Written By:
  • Publish Date - February 22, 2024 / 11:47 AM IST

 

PM Modi Reaction: పంటలకు కనీస మద్దతు ధర, రైతు రుణమాఫీ సహా పలు డిమాండ్లపై దేశ రాజధాని ఢిల్లీ(delhi)లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే దాదాపు 9 రోజుల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) గురువారం తొలిసారిగా స్పందించారు. రైతు సంక్షేమానికి సంబంధించిన ప్రతి తీర్మానాన్ని నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రస్తుత సీజన్ 2023-24లో చెరకుకు ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ (ఎఫ్ఆర్పీ) కంటే 8 శాతం అధికానికి కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపిన మరుసటి రోజే ప్రధాని మోడీ ఈ ప్రకటన చేశారు. సవరించిన ఎఫ్ఆర్పీ అక్టోబర్ 1, 2024 నుంచి అమల్లోకి వస్తుంది.

ఈ విషయాన్ని ఎక్స్ (గతంలో ట్విటర్) లో ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా రైతుల సంక్షేమమే ధ్యేయంగా తీర్మానాలను నెరవేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నొక్కి చెప్పారు. చెరకు కొనుగోలు ధరలో గణనీయమైన, చారిత్రాత్మక పెరుగుదలను ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయం దేశంలోని లక్షలాది చెరకు ఉత్పత్తి చేసే రైతులకు గణనీయమైన ప్రయోజనాలను తీసుకురానుందని హైలైట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఢిల్లీ సరిహద్దుల్లో యుద్దవాతావరణం కొనసాగుతోంది. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం కోసం పట్టుబడుతున్న రైతులు వెనక్కి తగ్గడం లేదు. కేంద్రానికి విధించిన డెడ్ లైన్ పూర్తి కావడంతో.. పంజాబ్-హర్యానా సరిహద్దులోని శంభు బోర్డర్ నుంచి ఢిల్లీ వైపు దూసుకొచ్చారు. దీంతో వారిని పోలీసులు, కేంద్ర బలగాలు అడ్డుకున్నాయి. రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా.. కాంక్రీట్‌ బ్లాక్‌లు, బారికేడ్లు, ఇనుప కంచెలు, కంటైనర్ల గోడలతో ఢిల్లీవైపు వచ్చే దారులు మూసివేశారు. ఘాజీపూర్‌ సరిహద్దు దగ్గర భారీగా పోలీసు, కేంద్ర బలగాలను మోహరించారు. సింఘు, టిక్రి సరిహద్దులను క్లోజ్ చేశారు. రైతులపై టియర్‌గ్యాస్‌ను పదేపదే ప్రయోగించారు పోలీసులు.

టియర్‌గ్యాస్‌ నుంచి తమను తాము కాపాడుకోవడానికి రైతులు అన్ని ఏర్పాట్లతో వచ్చారు. ముఖానికి మాస్కులు , కళ్లద్దాలు ధరించారు. MSPపై కేంద్రం తేల్చిన తరువాతే చర్చలపై స్పందిస్తామన్నారు. అయితే హర్యానా లోని కన్నౌరి బోర్డర్‌ దగ్గర పోలీసులు ప్రయోగించిన టియర్‌ గ్యాస్‌ షెల్‌ తగిలి ఓ రైతు చనిపోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆందోళన చేస్తున్న రైతులపై డ్రోన్లతో టియర్‌గ్యాస్‌ను ప్రయోగించారు. అయినప్పటికి ఆందోళకారులు వెనక్కి తగ్గడం లేదు. బారికేడ్లు తొలగించి ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. రైతుల ఆందోళన కారణంగా ఢిల్లీలో ట్రాఫిక్‌కు పలు చోట్ల తీవ్ర ఇబ్బంది కలుగుతోంది.

read also : Poonam Kaur : త్రివిక్రం పై పూనం మరోసారి ఎటాక్.. యూజ్ లెస్ ఫె… అంటూ..!

రైతుల డిమాండ్లపై కేంద్రం మరోసారి స్పందించింది. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని సూచిస్తూ.. ఐదో విడత చర్చలకు రైతు నాయకులను ఆహ్వానించింది. రైతులపై నమోదైన కేసులను ఎత్తేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అయితే పంటలకు కనీస మద్దతు ధర తేలిన తరువాతే చర్చలు గురించి ఆలోచిస్తామన్నారు రైతు సంఘాల నేతలు. సరిహద్దుల వరకు రైతులను తాము అనుమతి ఇస్తునట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని పంజాబ్‌ ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర హోంశాఖకు ఈవిషయంపై పంజాబ్‌ ప్రభుత్వం లేఖ రాసింది. హర్యానా సర్కార్‌ తీరుపై పంజాబ్‌ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్యానా పోలీసుల దాడిలో 160 మంది రైతులు గాయపడ్డారని తెలిపింది.