Site icon HashtagU Telugu

PM Modi : నేడు జగిత్యాలలో పర్యటించనున్న ప్రధాని మోడీ

Prime Minister Modi Public

Prime Minister Modi Public

 

 

PM Modi Public Meeting in Jagtial : ప్రధాని నరేంద్ర మోడీ9PM Modi )నేడు జగిత్యాల(Jagtial)లో జరిగే బీజేపీ విజయసంకల్ప సభ(BJP Vijayasankalpa Sabha)లో ప్రసంగించనున్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు వెలువడిన తర్వాత రాష్ట్రంలో, తొలి ఎన్నికల ప్రచార సభలో ప్రధాని పాల్గొననున్నారు. నిజామాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి లోక్‌సభ స్థానాలకు(Lok Sabha Seats) కేంద్రంగా జగిత్యాలలో బీజేపీ విజయసంకల్ప సభ నిర్వహిస్తోంది. ఇప్పటికే ప్రధాని రెండు విడతలుగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సభ అనంతరం మోడీ హైదరాబాద్‌కు, అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఉత్తర తెలంగాణపై బీజేపీ స్పెషల్​ ఫోకస్​ : కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్న బీజేపీ ఉత్తర తెలంగాణపై ఫోకస్​ పెట్టింది. గత పార్లమెంట్​ ఎన్నికల్లో ఆ పార్టీ రాష్ట్రంలో 4 స్థానాల్లో గెలుపొందగా అందులో 3 ఉత్తర తెలంగాణలోని కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ నియోజకవర్గాలే కావడం విశేషం. ఈ ప్రాంతంలో మరింత పట్టు బిగించేందుకు ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ సభలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 4న ఆదిలాబాద్‌లో సభ నిర్వహించగా, నేడు జగిత్యాలలో రెండో సభ జరగనుంది.

read also: TSRTC: విద్యార్థులకు అలర్ట్‌.. టెన్త్ పరీక్షల కోసం ప్రత్యేక బస్సులు

సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు(Lok Sabha Election Schedule) వెలువడిన తర్వాత రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న జగిత్యాల సభ ద్వారా కరీంనగర్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల శంఖాన్ని ప్రధాని పూరించనున్నారు. అభ్యర్థుల ఖరారులో మిగతా పార్టీల కంటే ముందున్న కాషాయ పార్టీ ఇప్పటికే కరీంనగర్‌, నిజామాబాద్‌ అభ్యర్థులుగా సిట్టింగ్‌ ఎంపీలు బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌లను ప్రకటించింది. పెద్దపల్లిలో గోమాసే శ్రీనివాస్‌కు అవకాశం ఇచ్చింది.

జగిత్యాలలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మోడీ సభ కోసం వాణీనగర్‌ గీతా విద్యాలయంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌(MP Dharmapuri Arvind) ఇప్పటికే రెండు సార్లు సభా ఏర్పాట్లను పరిశీలించారు. ఆదివారం బీజేపీ శాసనసభా పక్ష నేత, నిర్మల్‌ శాసనసభ్యుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వచ్చారు. పార్టీ జిల్లా ఇన్​ఛార్జి మోరపల్లి సత్యనారాయణ స్థానికంగా ఉండి పర్యవేక్షిస్తున్నారు.

read also: Keerti Suresh : మహానటిగా కీర్తి సురేష్ రాంగ్ చాయిస్.. యాక్టర్ కం డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!

కాగా, కేంద్ర బలగాలు ఇప్పటికే సభా ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్రధాని మోడీ సభ జరిగే ప్రాంతం, హెలిప్యాడ్‌ పరిసరాల్లో శనివారం ఎయిర్​ఫోర్స్​ హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కోరుట్ల శాసనసభ సెగ్మెంట్లు నిజామాబాద్‌ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉండగా ధర్మపురి సెగ్మెంటు పెద్దపల్లి కాన్స్టెన్సీ పరిధిలో ఉంది. రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలోని నాలుగు మండలాలు కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఉండటంతో జన సమీకరణకు జగిత్యాల అనువుగా ఉంటుందని పార్టీ నేతలు నిర్ణయించారు. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిపోయే కొన్ని ప్రాంతాల్లో కొత్తగా తారు రోడ్డు వేశారు.