Site icon HashtagU Telugu

Gujarat Elections : ఈ ఎన్నికలు 5ఏళ్ల కోసం కాదు..రాబోయే 25ఏళ్ల కోసం: ప్రధాని మోదీ

Modi DA

Modi (1)

ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా బొటాడ్ లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గుజరాత్ ఎన్నికలు వచ్చే ఐదేళ్లకోసం కాదని 25ఏళ్ల తర్వాత గుజరాత్ ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తాయన్నారు. బొటాడ్ తో సంబంధం ఉన్న జససంఘ్ కాలం నాటిదని…బోటాడ్ ప్రజలు ఎప్పుడూ మా వెంటే ఉన్నారన్నారు. నేను గుజరాత్ లో అన్ని ప్రాంతాలకు వెళ్లి ప్రజలను చూస్తున్నారు. నా పర్యటన తర్వాత గుజారాత్ మాకు ఆదేశాన్ని ఇవ్వబోతోంది. ఎన్నికల ఫలితాలు ప్రజలే నిర్ణయిస్తారన్నారు.

రాజకీయ పార్టీలు కేవలం అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడాలని ఒత్తిడి చేసిన ఏకైకపార్టీ బీజేపీ అని ప్రధాని ఈ సందర్భంగా ఉను్నారు. కానీ అన్ని పార్టీలు ముందు కులం గురించే మాట్లాడేవి అన్నారు. బోటాడ్, ధొలేరా, భావ్ నగర్ ప్రాజెక్టులు, పరిశ్రమలకు కేంద్రంగా మారే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. సైకిళ్లు కూడా తయారు చేయని గుజరాత్ లో ఇప్పుడు విమానాలు తయారు చేస్తున్నారని మోదీ అన్నారు. ఇంటింటికి మంచినీటి కుళాయిలు కావాలని ప్రజలు అడుగుతున్నారు. రైల్వే స్టేషన్ అడుగుతున్నారు. విమానాశ్రయం అడుగుతున్నారు. అంటే గుజరాత్ ప్రజలు గరిష్ట అభివృద్ధిని కోరుకుంటున్నట్లే కదా అన్నారు. అంతేకాదు 20వేల పాఠశాలలు 5జీ టెక్నాలజీతో పనిచేస్తున్నట్లు తెలిపారు మోదీ.

Exit mobile version