Site icon HashtagU Telugu

New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రధాని మోదీ!

Pm

Pm

కొత్త పార్లమెంట్ భవనాన్ని (New Parliament Building) ప్రధాని మోదీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పలు పనులను పరిశీలించి అక్కడ ఉన్న కార్మికులతో ముచ్చటించారు. కొత్త పార్లమెంట్ హౌస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్న సందర్భంగా ప్రధాని మోదీ గంటకు పైగా అక్కడే గడిపారు. పార్లమెంట్ ఉభయ సభలను పరిశీలించిన ప్రధాని మోదీ వివిధ పనులను పరిశీలించారు.

కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కింద దేశ రాజధాని న్యూఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొత్త పార్లమెంట్ భవనం లోపల నుంచి చిత్రాలు తెరపైకి రావడం ఇదే తొలిసారి. కొత్త పార్లమెంట్ హౌస్ లోపల ఫోటోలు తెరపైకి వచ్చాయి. అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను ప్రధాని మోదీ పరిశీలించారు. ప్రధాని ఆకస్మిక పర్యటనకు సంబంధించిన ఇప్పుడు వైరల్ గా మారాయి.