PM Modi : కేంద్రప్రభుత్వం ప్రధాని మోడీ విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు వివరాలను తాజాగా వెల్లడించింది. 2022 నుంచి 2024 డిసెంబర్ వరకూ ప్రధాని 38 విదేశీ పర్యటనలకు వెళ్లినట్లు తెలిపింది. ఈ పర్యటనలకు గానూ రూ.258 కోట్లు ఖర్చైనట్లు ప్రకటించింది. వసతి, వేదిక ఛార్జీలు, భద్రత, రవాణా, ఇతరత్రా ఖర్చులు అనే ఐదు పద్దుల కింద ఖర్చులు జరిగాయని, మొత్తం రూ.104 కోట్లు ఖర్చయిందని, ఇది మొత్తం ఖర్చులో సగం కంటే తక్కువని పేర్కొంది. ఆ తర్వాత ఇతరత్రా ఖర్చులు (రూ.75.7 కోట్లు), రవాణా (రూ.71.1 కోట్లు) ఉన్నాయని వివరించింది.
Read Also: Campa Vs Pepsi Coke : అంబానీ దెబ్బకు దిగొచ్చిన పెప్సీ, కోకకోలా.. రూ.10కే ఆ డ్రింక్స్
రాజ్యసభలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా లిఖితపూర్వక సమాధానమిచ్చారు. అధికారిక, సహాయక, భద్రత, మీడియా ప్రతినిధుల కోసం చేసిన ఖర్చును ఈ గణాంకాల్లో పొందుపరిచినట్లు తెలిపింది. 2022 మే నుంచి 2024 డిసెంబర్ వరకూ ప్రధాని 38 విదేశీ పర్యటనలకు వెళ్లినట్లు తెలిపారు. ఈ పర్యటనలకు గానూ రూ.258 కోట్లు ఖర్చైనట్లు వెల్లడించారు. గతేడాది సెప్టెంబరులో మోదీ అమెరికా వెళ్లినప్పుడు రూ.15.33 కోట్లు ఖర్చు అయినట్లు పేర్కొంది. ఇక మే 2022లో ప్రధాని నేపాల్ పర్యటనకు రూ.80 లక్షలు, మే 2023లో జపాన్ పర్యటనకు రూ.17.19 కోట్లు ఖర్చైనట్లు వివరించింది.
2022-24 మధ్య ప్రధాని మోడీ అమెరికా, జపాన్, జర్మనీ, కువైట్, డెన్మార్క్, ఫ్రాన్స్, యూఏఈ, నేపాల్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, గ్రీస్, పోలాండ్, ఉక్రెయిన్, రష్యా, ఇటలీ, బ్రెజిల్, గయానాలో పర్యటించారు. 2022 మేలో ప్రధాని తన విదేశీ పర్యటనను జర్మనీతో ప్రారంభించారు. 2024 డిసెంబర్‌లో కువైట్‌తో తన పర్యటనలు ముగిశాయి. ఇందులో అత్యధికంగా 2023 జూన్‌లో జరిగిన అమెరికా పర్యటనకు రూ.22కోట్లు ఖర్చు అయినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. అదే ఏడాది ఫ్రాన్స్ సందర్శనకు రూ.8.33 కోట్లు, 2013లో రష్యా సందర్శనకు రూ.9.95 కోట్లు, 2013లో జర్మనీ పర్యటనకు రూ.6 కోట్లు ఖర్చైనట్లు వెల్లడించారు.ఇక 2014కి ముందు అప్పటి ప్రధానులు చేసిన విదేశీ పర్యటనలకు సంబంధించిన ఖర్చుల వివరాలను కూడా మంత్రి వెల్లడించారు. 2011లో అప్పటి ప్రధాని అమెరికా పర్యటనకు రూ.10.74 కోట్లు ఖర్చైనట్లు తెలిపారు.
Read Also: Harish Rao : ఎన్నికలకు ముందు వాగ్దానాలు ..ఎన్నికలు అయ్యాక ఏమార్చేశారు : హరీశ్ రావు