Site icon HashtagU Telugu

Sunitha Williams : మీరు విజయవంతంగా తిరిగి రావడాన్ని గర్వంగా భావిస్తున్నాం: ప్రధాని

Prime Minister congratulates Sunita Williams team

Prime Minister congratulates Sunita Williams team

Sunitha Williams : ప్రధాని నరేంద్ర మోడీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి వచ్చిన సునీత విలియమ్స్‌ బృందానికి ‘ఎక్స్‌’ వేదికగా అభినందనలు తెలిపారు. క్రూ 9.. మీకు స్వాగతం.. భూమి మిమ్మల్ని మిస్‌ అయింది. సునీత విలియమ్స్‌ ఒక మార్గదర్శకురాలు. మీరు విజయవంతంగా తిరిగి రావడాన్ని గర్వంగా భావిస్తున్నాం అని మోడీ పేర్కొన్నారు. మీ అపరిమిత ధైర్యం, స్ఫూర్తికి ఇన్నాళ్లూ పరీక్ష ఎదురైంది. అయినా మీ పట్టుదల ఏంటో అందరికీ చూపించారు. క్లిష్టమైన, అనిశ్చిత పరిస్థితుల్లో అచంచలమైన సంకల్పంతో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. లక్షల మందిలో స్ఫూర్తి నింపారు అని ప్రధాని మోడీ తెలిపారు.

Read Also: Investment : భూమి మీద కంటే బంగారం పై పెట్టుబడి పెడితే మంచిదా..?

దేశంలోని 140 కోట్ల మంది భారతీయులు ఎల్లప్పుడూ మీ విజయాల పట్ల గర్వంగా ఉన్నారని. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు మీ స్ఫూర్తిదాయకమైన ధైర్యం, పట్టుదలను మరోసారి ప్రదర్శించాయని మోడీ కొనియాడారు. కాగా, తొమ్మిది నెలల అనంతరం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌ మరో ఇద్దరు వ్యోమగాములు బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. స్పేస్‌ఎక్స్, నాసా సమష్టి కృషివల్లే ఇది సాధ్యమైంది. ల్యాండింగ్ సమయంలో భద్రతాపరంగా అమెరికా కోస్ట్‌గార్డ్ అన్ని చర్యలు తీసుకుంది. స్పేస్‌ఎక్స్ సంస్థ ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్య శక్తిని చాటింది.

భవిష్యత్తులో మరిన్న అంతరిక్ష పరిశోధనలకు ఇది ఉపయోగపడుతుంది. అన్‌-డాకింగ్‌ నుంచి సాఫ్ట్‌ ల్యాండింగ్‌ వరకు అన్నీ సజావుగా సాగాయి. ప్రస్తుత మిషన్ భవిష్యత్‌ మానవసహిత అంతరిక్షయాత్రకు కొత్తదారి చూపింది. ఇక, 9 సార్లు స్పేస్ వాక్ నిర్వహించిన సునీతా విలియమ్స్. మొత్తంగా 62 గంటల 6 నిమిషాల పాటు నడిచారు. దీంతో సుదీర్ఘ సమయం స్పేస్‌వాక్‌ చేసిన మహిళా వ్యోమగామిగా ఆమె రికార్డు సృష్టించారు.

Read Also: Telangana Budget 2025 : శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి భట్టి విక్రమార్క