Site icon HashtagU Telugu

Gas Price Today : గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్..

LPG Price Cut

LPG Price Cut

ఒకటో తారీఖు వచ్చిందంటే సామాన్య ప్రజలంతా ముందుగా చూసేది గ్యాస్ ధర (Gas Price ) గురించే..ఈ నెల చమురు కంపెనీలు గ్యాస్ ధరలు తగ్గించాయా..? పెంచాయా..? తగ్గిస్తే ఎంత తగ్గించింది..పెంచితే ఎంత పెంచింది..? సామాన్య ప్రజలకు ఊరట కల్పించిందా లేదా..? ఇలా దేశ ప్రజలంతా మాట్లాడుకుంటారు. ఈరోజు ఏప్రిల్ 1 (April 1) రానే వచ్చింది. ఎప్పటిలాగే చమురు కంపెనీలు గ్యాస్ ధరల వివరాలు తెలిపాయి.

ఈసారి కమర్షియల్ గ్యాస్ (Commercial LPG Cylinder) వాడుకునే వారికీ కాస్త ఊరట కలిపించాయి. 19కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.30.50 , 5 కేజీల FTL సిలిండర్ ధరఫై రూ.7.50 తగ్గించాయి. తగ్గిన ధరలు ఈరోజు నుంచి అమల్లోకి వచ్చాయి. అటు గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడం తో సామాన్య ప్రజలు అయ్యో అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తగ్గినా కమర్షియల్ గ్యాస్ ధర తో దేశ రాజధాని ఢిల్లీలో రూ. 1764.50కి చేరింది. అంతకుముందు ఇది రూ. 1795 గా ఉండేది. అంటే ఒక్కో సిలిండర్‌పై రూ. 30.50 తగ్గిందన్నమాట. కోల్‌కతాలో రూ. 1879, ముంబైలో రూ. 1717.50, చెన్నైలో రూ. 1930 కి చేరాయి. హైదరాబాద్‌లో కూడా ఈ ధర తగ్గినట్లు తెలుస్తోంది. అంతకుముందు నెలలో రూ. 25 పెరిగి రూ. 2027 కు చేరగా.. ఇప్పుడు రూ. 30.50 తగ్గింది. ఇక ఇంట్లో వాడే గ్యాస్ ధరలు చూస్తే..ఢిల్లీలో ప్రస్తుతం 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ. 803 గా ఉంది. హైదరాబాద్‌లో ఇది రూ. 855 గా ఉంది.

Read Also : Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నాకు వార్నింగ్ ఇచ్చారు.. నటుడు శివాజీ రాజా కామెంట్స్ వైరల్!