Site icon HashtagU Telugu

President in Sukhoi-30 :యుద్ధవిమానంలో ముర్ము ప్ర‌యాణం

President in Sukhoi-30

Murmu

రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము సాహ‌సం (President in sukhoi-30)చేశారు. ఆమె సుఖోయ్ యుద్ధ విమానంలో ప్ర‌యాణించారు. రాష్ట్ర‌ప‌తి హోదాలో (Murmu)ఒక మ‌హిళ ప్ర‌యాణించ‌డం అరుదైన రికార్డ్‌. యుద్ధ విమానంలో ప్ర‌యాణించిన రెండో మ‌హిళా అధ్య‌క్షురాలిగా చ‌రిత్ర సృష్టించారు. చారిత్రాత్మ‌క‌మైన ఆమె ప్ర‌యాణం 30 నిమిషాల పాటు సాగింది. స‌ముద్ర మ‌ట్టానికి రెండు కిలోమీట‌ర్ల ఎత్తులో గంట‌కు 800 కిలో మీట‌ర్ల స్పీడుతో ముర్ము ప్ర‌యాణించారు.

రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము సాహ‌సం (President in sukhoi-30)

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(murmu) శనివారం అస్సాంలోని తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో సుఖోయ్ 30 MKI ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో (President in sukhoi-30)ప్ర‌యాణించారు. యుద్ధ విమానాన్ని నడిపిన మూడవ అధ్యక్షురాలుగా ముర్ము రికార్డ్ నెల‌కొల్పారు. రెండవ మహిళా అధ్యక్షురాలుగా నిలిచారు. భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్ హోదాలో ఆమె అస్సోంలో మూడు రోజుల ప‌ర్య‌ట‌న చేశారు. ఆ సంద‌ర్భంగా యుద్ధ విమానంలో బ్రహ్మపుత్ర , తేజ్‌పూర్ లోయలను కప్పి ఉన్న హిమాలయాల మీదుగా సుమారు 30 నిమిషాల పాటు ప్రయాణించి తిరిగి ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు చేరుకున్నారు.

స‌ముద్ర మ‌ట్టానికి రెండు కిలోమీట‌ర్ల ఎత్తులో గంట‌కు 800 కిలో మీట‌ర్ల స్పీడుతో ముర్ము

యుద్ధ విమానాన్ని (President in sukhoi-30) 106 స్క్వాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్ గ్రూప్ కెప్టెన్ నవీన్ కుమార్ న‌డిపారు. ఆ మేర‌కు అధికారికంగా ప్ర‌క‌టించారు. సముద్ర మట్టానికి దాదాపు 2 కిలోమీటర్ల ఎత్తులో మరియు గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. అనంతరం సందర్శకుల పుస్తకంలో రాష్ట్ర‌ప‌తి ముర్ము (murmu) ఆమె అనుభ‌వాన్ని సంక్షిప్త నోట్ రాశారు.

భారత వైమానిక దళానికి చెందిన శక్తివంతమైన సుఖోయ్-30 MKI ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌

`భారత వైమానిక దళానికి చెందిన శక్తివంతమైన సుఖోయ్-30 MKI ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో(President in sukhoi-30) ప్రయాణించడం నాకు సంతోషకరమైన అనుభవం` అని ఆమె రాశారు. `భూమి, గగనతలం, సముద్రం అన్ని సరిహద్దులను కవర్ చేసేలా భారత రక్షణ సామర్థ్యాలు అద్భుతంగా విస్తరించడం గర్వించదగ్గ విషయం. అద్బుత ప్ర‌యాణాన్ని యుద్ధ‌విమానంలో చేయించిన‌ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ , ఎయిర్ ఫోర్స్ స్టేషన్ తేజ్‌పూర్ బృందాన్ని నేను అభినందిస్తున్నాను.` అంటూ ముర్ము (murmu) అన్నారు. ఆ సంద‌ర్భంగా విమానాల గురించి, భారత వైమానిక దళం కార్యాచరణ సామర్థ్యాల గురించి కూడా రాష్ట్రపతికి వివరించబడింది.

Also Read : Draupadi Murmu: జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం.. కీలక అంశాలివే!

భారత వైమానిక దళం కార్యాచరణ సన్నద్ధతపై ముర్ము సంతృప్తి వ్యక్తం చేశారు. భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్‌గా సాయుధ బలగాలతో నిమగ్నమయ్యేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే సుఖోయ్ 30 MKI ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో(President in sukhoi-30) రాష్ట్రపతి ప్రయాణించడం అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.

2009లో, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పూణె వైమానిక దళ స్థావరం నుండి ఫ్రంట్‌లైన్ సుఖోయ్-30 MKI ఫైటర్ జెట్‌లో ప్రయాణించారు. అలాగే, అబ్దుల్ కలాం, రామ్‌నాథ్ కోవింద్ కూడా మహారాష్ట్రలోని పూణేలోని IAF స్టేషన్‌లో సుఖోయ్ 30 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లలో సేవలు అందించారు.

Also Read : President of India: జూలై 25నే రాష్ట్రపతులంతా ఎందుకు ప్రమాణం చేస్తారో తెలుసా?