Site icon HashtagU Telugu

President Draupadi : రాష్ట్రపతి ప్రసంగంతో రేపటి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం

President Droupadi Speech

President Droupadi Speech

రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ( President Draupadi)ప్రసంగంతో పార్లమెంట్‌ సమావేశాలు (Parliament Sessions)ప్రారంభంకానున్నాయి. కొత్త పార్లమెంట్ భవనం లో మొదటిసారి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు రాష్ట్రపతి ద్రౌపది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది.

ప్రస్తుత లోక్‌సభకు చివరి సమావేశాలు కావడంతో సుహృద్భావ వాతావరణంలో సమావేశాలు నిర్వహించాలని యోచిస్తోంది కేంద్రం. కీలక బిల్లులు అన్నింటికి గత సమావేశాల్లోనే ఆమోదం తెలపడంతో… ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుత సమావేశాల్లో 19 బిల్లులు ఆమోదానికి తీసుకువస్తున్న కేంద్రం….ఈ బిల్లులు అన్ని ఇప్పటికే ఉభయ సభల్లో ప్రవేశ పెట్టినందున… ఆమోదం తెలిపేందుకు చర్చకు తీసుకురానున్నట్లు సమాచారం అందుతోంది. కొత్తగా తీసుకువచ్చిన భద్రతా ఏర్పాట్లపై కూడ అన్ని పార్టీలకు వివరించనున్నట్లు సమాచారం అందుతోంది. సభా కార్యకలాపాలకు సహకరించాలని కోరనుంది కేంద్ర ప్రభుత్వం.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు మధ్యంతర బడ్జెట్‌కు ముందు ‘ఇండియన్ ఎకానమీ – ఏ రివ్యూ’ పేరిక కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక రిపోర్ట్ విడుదల చేసింది. వరుసగా మూడవ ఏడాది భారత్ 7 శాతానికి పైగా వృద్ధి రేటును సాధించలేదని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3 శాతానికి మించి వృద్ధిని సాధించడమే గగనంగా మారిన పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థ దృఢంగా పురోగమిస్తోందని పేర్కొంది.

స్థిరమైన ఆర్థిక వృద్ధికి భారత్ కట్టుబడి ఉందని ఆర్థికశాఖ పేర్కొంది. వాతావరణ మార్పులు, కర్బన ఉద్గారాల నియంత్రణకు అవసరమైన పెట్టుబడులను సమీకరిస్తున్నట్టుగా రిపోర్టులో పేర్కొంది. గత దశాబ్ద కాలంలో ప్రభుత్వ రంగ మూలధన పెట్టుబడి పెరిగిందని తెలిపింది. ఆర్థిక రంగం పదిలంగా ఉందని, ఆహారేతర రుణ వృద్ధి బలంగా ఉందని, ఇవన్నీ దేశ ఆర్థిక పటిష్ఠతను తెలియజేస్తున్నాయని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు తీసుకొచ్చిన సంస్కరణలు బ్యాంకులు, కార్పొరేట్ సంస్థల బ్యాలెన్స్ షీట్లను మెరుగుపరిచాయని ప్రస్తావించింది. జీఎస్టీ విధానాన్ని పాటించడంతో దేశీయ మార్కెట్ల ఏకీకరణ చేయడం సాధ్యపడిందని, ఆర్థిక సామర్థ్యాన్ని పెంపొందించిందని నివేదిక పేర్కొంది.

Read Also : Pakistan New Currency: కొత్త కరెన్సీ నోట్లను ప్ర‌వేశ‌పెడుతున్న పాకిస్థాన్‌.. కార‌ణ‌మిదే..?