Site icon HashtagU Telugu

President Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైర‌ల్‌!

President Droupadi Murmu

President Droupadi Murmu

President Droupadi Murmu: ప్రమాదోం స్టేడియంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తీసుకెళ్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత హెలిప్యాడ్ టార్మాక్‌లో కొంత భాగం కుంగిపోయింది. అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి హెలికాప్టర్‌ను కుంగిన ప్రదేశం నుంచి భౌతికంగా తోసి బయటకు తీశారు. భద్రతా ప్రోటోకాల్స్ మధ్య ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

శబరిమల ఆలయ దర్శనం కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేరళ చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హెలికాప్టర్ బరువును తట్టుకోలేకపోవడం వల్ల ప్రమాదోం స్టేడియంలో నిర్మించిన హెలిప్యాడ్ టార్మాక్ కొంత భాగం కుంగిపోయింది. అయితే, ఈ ఘటన జరిగిన సమయంలో రాష్ట్రపతి ముర్ము హెలికాప్టర్ లోపల లేరు.

పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తత

అకస్మాత్తుగా తలెత్తిన ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి అక్కడే ఉన్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే చర్యలు తీసుకున్నారు. వారంతా కలిసి హెలికాప్టర్‌ను కుంగిన ప్రదేశం నుంచి బయటకు తోశారు. సమాచారం ప్రకారం.., రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తుతం రాజ్‌భవన్‌ నుంచి శబరిమల దర్శనం కోసం బయలుదేరారు.

Also Read: Gold Price : ఒకేసారి రూ.3 వేలకు పైగా తగ్గిన బంగారం ధర

జిల్లాకు చెందిన ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం ఈ స్థలాన్ని చివరి నిమిషంలో నిర్ణయించారు. అందుకే హెలిప్యాడ్‌ను మంగళవారం అర్ధరాత్రి హడావుడిగా నిర్మించారు. కాంక్రీటు పూర్తిగా గట్టిపడకపోవడం వల్ల అది హెలికాప్టర్ బరువును మోయలేకపోయింది. దాని చక్రాలు తగిలిన చోట గోతులు ఏర్పడ్డాయి. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ల్యాండింగ్ స్థలాన్ని నిలక్కల్ నుండి ప్రమాదోంకు మార్చాల్సి వచ్చిందని పోలీసు అధికారి తెలిపారు.

పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి హెలికాప్టర్‌ను తోశారు

రాష్ట్రపతి ముర్ము పంపాకు రోడ్డు మార్గంలో బయలుదేరిన తర్వాత పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హెలికాప్టర్‌ను కుంగిన ప్రదేశం నుండి బయటకు తీశారు.

రాష్ట్రపతి కేరళ పర్యటన వివరాలు

రాష్ట్రపతి సచివాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్టోబర్ 21 నుండి 24 వరకు కేరళ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రపతి అక్టోబరు 22న శబరిమల ఆలయాన్ని దర్శించుకుని, హారతిలో పాల్గొంటారు. అక్టోబరు 23న తిరువనంతపురంలోని రాజ్‌భవన్‌లో భారత మాజీ రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం వర్కల శివగిరి మఠంలో శ్రీ నారాయణ గురు మహాసమాధి శతాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఆమె పాలైలోని సెయింట్ థామస్ కళాశాల ప్లాటినం జూబ్లీ ఉత్సవాల ముగింపు వేడుకల్లో కూడా పాల్గొంటారు. అక్టోబరు 24న రాష్ట్రపతి ఎర్నాకుళంలోని సెయింట్ థెరిసా కళాశాల శతాబ్ది వేడుకల్లో పాల్గొంటారని పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

Exit mobile version