Parliament : ప్రజలు సుస్థిరతకు పట్టం కట్టారు – రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ప్రభుత్వం చేపట్టే నియామకాలు, పరీక్షల్లో పవిత్రత ఉండాలి. పారదర్శకంగా జరగాలి. పేపర్‌ లీక్‌లు, పరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన కేసుల్లో ఉన్నత స్థాయిలో విచారణ జరుగుతోంది. ఇలాంటి ఘటనల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరముంది

  • Written By:
  • Publish Date - June 27, 2024 / 12:32 PM IST

నాలుగోరోజు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. లోక్ సభ సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా, నేటి నుంచి రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి (address joint session) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) ప్రసంగించారు. ముందుగా రాష్ట్రపతి కి ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌లు స్వాగతం పలికారు. అనంతరం కొత్తగా కొలువుదీరిన 18వ లోక్‌సభతో పాటు రాజ్యసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించడం మొదలుపెట్టారు.

ఇటీవల లోక్సభ ఎన్నికల్లో గెలుపొంది ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేసిన వారికి ఈ సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రజల విశ్వాసం గెలిచి సభకు ఎన్నికయ్యారని, వారి ఆకాంక్షలను నెరవేరుస్తారని ఆశిస్తున్నానన్నారు. ప్రజలు సుస్థిరతకు పట్టం కట్టారని, ప్రపంచమంతా భారత ఎన్నికలను నిశితంగా పరిశీలించిందని రాష్ట్రపతి ముర్ము తెలిపారు. పౌర విమానయాన రంగం అనేక మార్పులు తెచ్చామని, టైర్‌ 2, 3 నగరాల్లో విమానాశ్రయాలు నిర్మిస్తున్నామన్నారు. అలాగే సర్వీస్‌ సెక్టార్లను కూడా ప్రభుత్వం బలపరుస్తోందన్నారు. ప్రపంచంలోనే ఐదవ బలమైన ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతోందన్నారు. తమ ప్రభుత్వంలోనే భారత్‌ను అత్యున్నత జీవన ప్రమాణాలున్న దేశంగా తీర్చిదిద్దిందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతలకు కట్టుబడి ఉందన్నారు. తమ ప్రభుత్వం 10 ఏళ్లుగా దేశాభివృద్ధి కృషి చేస్తోందన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇటీవల నీట్‌ యూజీ, నెట్‌ వంటి ప్రవేశ పరీక్షల్లో జరిగిన అక్రమాల గురించి రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘ప్రభుత్వం చేపట్టే నియామకాలు, పరీక్షల్లో పవిత్రత ఉండాలి. పారదర్శకంగా జరగాలి. పేపర్‌ లీక్‌లు, పరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన కేసుల్లో ఉన్నత స్థాయిలో విచారణ జరుగుతోంది. ఇలాంటి ఘటనల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరముంది. నీట్‌, తదితర పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. పేపర్‌ లీకేజీ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని , ప్రజా సంక్షేమం కోసం అనేక సంస్కరణలు అమలు చేస్తున్నట్లు రాష్ట్రపతి చెప్పారు. ప్రపంచ వృద్ధిలో భారత్‌ వాటా 15 శాతంగా ఉన్నట్లు తెలిపారు. అన్నిరంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయని, హరిత ఇంధనం సాధన దిశగా తమప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్రపతి తెలిపారు.

Read Also : Business Idea: త‌క్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించే బిజినెస్ ఇదే..!