Sudha Murthy : సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ప్రధాని ఏమన్నారంటే..

Sudha Murthy : ఇన్ఫోసిస్‌ అధిపతి నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తికి అరుదైన గౌరవం లభించింది. ఆమెను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్యసభకు నామినేట్‌ చేశారు. ఈసందర్భంగా సుధామూర్తికి  శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్వీట్‌ చేశారు. విద్యావేత్త, రచయిత, మానవతావాదిగా ఖ్యాతి గడించిన ఇన్ఫోసిన్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్యసభకు నామినేట్‌ చేయడం గొప్ప విషయమని ప్రధాని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ (ఎక్స్)లో  ఒక పోస్ట్ చేశారు. We’re […]

Published By: HashtagU Telugu Desk
Marriage Expense

Sudhamurthy

Sudha Murthy : ఇన్ఫోసిస్‌ అధిపతి నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తికి అరుదైన గౌరవం లభించింది. ఆమెను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్యసభకు నామినేట్‌ చేశారు. ఈసందర్భంగా సుధామూర్తికి  శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్వీట్‌ చేశారు. విద్యావేత్త, రచయిత, మానవతావాదిగా ఖ్యాతి గడించిన ఇన్ఫోసిన్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్యసభకు నామినేట్‌ చేయడం గొప్ప విషయమని ప్రధాని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ (ఎక్స్)లో  ఒక పోస్ట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join

సామాజిక సేవలో సుధామూర్తిది స్ఫూర్తిదాయక ప్రస్థానం అని కొనియాడారు. సామాజిక సేవ, దాతృత్వం, విద్య సహా విభిన్న రంగాల్లో సుధామూర్తి చేసిన సేవలు వెలకట్టలేనివని చెప్పారు. సుధామూర్తి లాంటి వ్యక్తి రాజ్యసభలో ఉండటం నారీ శక్తికి ఒక శక్తివంతమైన నిదర్శనంగా నిలుస్తుందన్నారు.  రాజ్యసభకు సుధామూర్తిని నామినేట్‌ చేయడం దేశంలో మహిళల శక్తి సామర్థ్యాలకు ప్రత్యక్ష ఉదాహరణ అని ప్రధాని మోడీ తెలిపారు.

Also Read : Gujarat Titans: గుజ‌రాత్ టైటాన్స్‌కు మ‌రో బిగ్ షాక్‌.. తొలి మ్యాచ్‌కు స్టార్ ప్లేయ‌ర్ దూరం..?

పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులను పొందినా..

ఇన్ఫోసిస్ ఛైర్ పర్సన్ సుధా మూర్తి..  పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులను పొందినా,  ఆమె ఎప్పుడూ సింపుల్‌గానే కనిపిస్తారు. రచయితగా, వక్తగా, సామాజిక సేవకురాలిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏ కార్యక్రమానికి వెళ్లినా అక్కడి వాళ్లతో ఇట్టే కలిసిపోతారు. గతేడాది మార్చి నెలలో కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అట్టుకల్ భగవతి ఆలయంలో జరిగిన పొంగల్ వేడుకల్లో సుధామూర్తి పాల్గొన్నారు. వాటికి సంబంధించిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఓ సామాన్యురాలిగా కింద కూర్చుని భక్తులందరికీ ఆమె పొంగళిని వడ్డించారు. వేలాది మంది భక్తులకు ఆమె ప్రసాదం వితరణ చేశారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణిగా, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అత్తయ్యగానే కాకుండా వ్యక్తిగతంగానూ ఎంతో చరిష్మా ఉన్న సుధామూర్తి ఇంత సింపుల్‌గా కనిపించడం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.

  Last Updated: 08 Mar 2024, 02:04 PM IST