ఒడిశాలోని కంధమాల్ (Kandhamal) జిల్లాలో వెలుగు చూసిన ఘోర ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ కలిగిస్తోంది. ప్రభుత్వ హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న ఇద్దరు మైనర్ బాలికలు గర్భవతులైన విషయం వైద్య పరీక్షల్లో తేలింది. హాస్టల్‌లో వేసవి సెలవుల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత సాధారణ ఆరోగ్య తనిఖీల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. శానిటరీ నాప్‌కిన్‌ల కోసం బాలికలు హాస్టల్ మ్యాట్రన్‌ను కలవకపోవడంతో అనుమానం పెరిగి వైద్య పరీక్షలు చేయగా ఈ దారుణమైన నిజం బయటపడింది.
గర్భవతులైనట్లు తెలిసిన వెంటనే హాస్టల్ అధికారులు బాలికల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మాయమాటలతో బాలికలను బలవంతంగా గర్భవతులయ్యేలా చేశారా, లేక వారి అంగీకారంతో జరిగిందా అనే కోణాల్లో లోతుగా విచారిస్తున్నారు. బాధిత బాలికలకు వైద్యసహాయం అందిస్తూనే, వారు మనోబలాన్ని కోల్పోకుండా చూసేందుకు కౌన్సిలింగ్ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Demolition of Peddamma Temple : పెద్దమ్మగుడి కూల్చివేతలో కాంగ్రెస్ కుట్ర – బండి సంజయ్
ఇది ఒక్కటే కాదు, ఒడిశాలో ఇటువంటి దారుణాలు వరుసగా జరుగుతుండటం స్థానికుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. బాలసోర్ జిల్లా బర్హంపూర్ ప్రాంతంలో ఇటీవల మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని చెరువు వద్ద 20 ఏళ్ల మహిళపై నలుగురు యువకులు అత్యాచారయత్నం చేయగా, ఆమె ప్రతిఘటనతో విఫలమయ్యారు. అనంతరం బండరాయితో ఆమెను చంపే ప్రయత్నం చేసిన ఆ కామాంధులు స్థానికుల చేరడంతో అక్కడి నుంచి పరారయ్యారు. అయితే పోలీసులు వెంటనే స్పందించి నలుగురిని అరెస్ట్ చేశారు.
ఈ వరుస ఘటనలతో ఒడిశాలో మహిళలు, బాలికల భద్రతపై పెద్ద ప్రశ్నేలు తలెత్తుతోంది. ప్రభుత్వ హాస్టళ్ల వంటి భద్రత కల్పించాల్సిన ప్రదేశాల్లోనే ఈవిధమైన సంఘటనలు చోటుచేసుకోవడం తీవ్రంగా ఆందోళన కలిగిస్తోంది. సమాజంగా మనం బలహీన వర్గాల పిల్లల భద్రతను, అభివృద్ధిని గౌరవించకపోతే, వారు చదువుతో వెలుగులోకి రావాలన్న ప్రయత్నాలు మధ్యలోనే ఆగిపోతాయి. ప్రభుత్వం ఈ ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులను శిక్షించి భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా కాపాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.