Site icon HashtagU Telugu

PK and Politics:జన్ సురాజ్ దిశగా నా అడుగులు.. ట్విట్టర్ వేదికగా పీకే ప్రకటన..!!

Kishore Imresizer

Kishore Imresizer

ప్రముఖ ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. తన సొంత రాష్ట్రమైన బీహార్ నుంచే రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పీకే ట్వీట్ చేశారు. పది సంవత్సరాలుగా ప్రజల పక్షాన విధానాలను రూపొందించానని…అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేశానని ఈ సందర్భంగా తెలిపారు. ప్రజా సమస్యలు మరింతగా అర్థ చేసుకోవల్సి ఉందన్న పీకే…ప్రజలకు చేరువకావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సుపరిపాలన (జన్ సురాజ్) దిశగా తన అడుగులు ఉంటాయని…బీహార్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు ప్రశాంత్ కిషోర్.

పీకే ట్వీట్ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు స్పష్టం చేశారు. అయితే కొత్త పార్టీ పెట్టనున్నారా లేదా మరేదైనా కూటమితో ముందుకు సాగుతారా అనేది ఇంకా క్లారిటీ లేదు. బిహార్ నుంచి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లగా వెల్లడించారు. అయితే నాలుగేళ్ల క్రితం నితీష్ కుమార్ కు చెందిన జేడీయూలో చేరిన ప్రశాంత కిషోర్ ఏడాది కాలానికిపైగానే అందులో ఉన్నారు. ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చేశారు.

బిహార్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించనున్న పీకే…మొదట రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో ఓటర్ల అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాతే రాజకీయపార్టీపై క్లారిటీ ఉంటుందన్న మాట వినిపిస్తోంది. కాగా ఈ మధ్యే కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీతో పలుసార్లు చర్చలు జరిపారు పీకే. 2024ఎన్నికలకు సంబంధించి ఆపార్టీముందు కొన్ని ప్రతిపాదనలు కూడా ఉంచారు. అయితే పలు దఫాలుగా చర్చలు జరిగినా..అవి ఫలించలేకపోడంతో…కాంగ్రెస్ లోచేసిన ప్రతిపాదనను పీకే తిరస్కరించినట్లుగా ప్రకటించారు. ఈ తరుణంలోనే కాంగ్రెస్ తో చర్చలు జరుపుతూ…తెలంగాణ సీఎం కేసీఆఱ్ తో కూడా భేటీ అయ్యారు. పీకేకు చెందిన ఐప్యాక్ పలు పార్టీలకు పనిచేస్తుందన్న సంగతి తెలిసిందే. ప్రాంతీయ పార్టీలతో పీకే మంచి సంబంధాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని కలుపుకుని ముందుకు సాగేందుకు పీకే ప్లాన్ చేస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.