Site icon HashtagU Telugu

PM Modi: దేశ ప్రధానిగా మోడీ మూడోసారి ఎన్నికవ్వడం ఖాయం

PM Modi

PM Modi

PM Modi: నితీష్ కుమార్ బీజేపీ మద్దతుతో 9వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి నుంచి బయటకు వచ్చి ఎన్డీయే కూటమిలో చేరటం వల్ల ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’ ఎటువంటి ప్రభావం పడదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నా..ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు మాత్రం ప్రాథాన్యత సంతరించుకున్నాయి.

బీహార్ లో ఇండియా కూటమిని దెబ్బతీయటానికి భారతీయ జనతా పార్టీ మాస్ట్ ప్లాన్ వేసిందని, నితీష్ కుమార్ కపట బుద్ది కల రాజకీయ నాయకుుడు అంటూ విమర్శించారు ప్రశాంత్ కిషోర్.. నితీశ్ తో కలిసి వెళ్లడం మూలంగా భారతీయ జనతా పార్టీకి పెద్దగా ఒరిగేది ఏమి ఉండదన్నారు. బీహర్ లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసినా నుంచి ఫలితాలనే సాధిస్తుందని అన్నారు.

త్వరలో జరగనున్న పార్లమెంట ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక ఎంపీ సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉందని తెలియజేశారు. దాదాపు మూడోసారి మోదీ ప్రధాన మంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయంటూ పరోక్షంగా తెలియజేశారు.

ఎన్ డి ఎ లో నితీష్ కుమార్ భాగస్వామిగా ఉన్నా 2025లో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ ఆ కూటమి నుంచి బయటకు వస్తారని లోక్ సభ ఎన్నికల ఫలితాలు అనంతర ఎన్డీయేతో నితీష్ కుమార్ కు విభేదాలు వస్తాయంటూ వ్యాఖ్యానించారు. నితీష్ రాజకీయం జీవితంలో ఇదే చివరి ఇన్సింగ్స్ అని ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు చేశారు.2025లో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 20 స్థానాల్లో కూడా జేడీయూ విజయం సాధించలేదని జోష్యం చెప్పారు ప్రశాంత్ కిషోర్

నితీష్ కుమార్ ఏ కూటమితో వెళ్లినా సరే ఆయన పార్టీ అంతం కావటం ఖాయమన్నారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం నితీష్ కుమార్ 20 అసెంబ్లీ స్థానాలకే పరిమితమవుతారని అన్నారు. నితీష్ ను బిహార్ ప్రజలు తిస్కరిస్తునాని. అందుకే తన సీఎం కుర్చీ కోసం కూటములు మారుతున్నారని మండిపడ్డారు ప్రశాంత్ కిషోర్.

Also Read: Nara Bhuvaneshwari : నారా భువనేశ్వరి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య