Site icon HashtagU Telugu

Prashant Kishor: బీహార్ లో ప్రశాంత్‌ కిషోర్‌ రాజకీయం

prashant kishore

prashant kishore

Prashant Kishor: బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌పై ప్రశాంత్‌ కిషోర్‌ రాజకీయ దాడి చేశారు. హాజీపూర్. జర్నలిస్టుల సమావేశంలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. బీహార్‌ను నాశనం చేసిన వ్యక్తులు పదిహేనేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తారోనంటూ డిప్యూటీ సీఎంను దుయ్యబట్టారు.

ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని డిప్యూటీ సీఎం ప్రకటించారని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వారికి ప్రభుత్వం జీతాలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎక్కడి నుంచి కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారు. ఇవేం ఆలోచించకుండా తొలి కేబినెట్‌లోనే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. ఆగస్టులో మహాకూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మంత్రివర్గ సమావేశం జరగలేదా? అని ప్రశ్నించారు. మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అనుకున్నట్లుగానే కిడ్నాప్‌లు, దోపిడీలు శరవేగంగా పెరిగిపోతున్నాయి. నేడు మద్యం, ఇసుక మాఫియా అనే అతిపెద్ద వ్యాపారం రూపుదిద్దుకుందని విమర్శించారు ప్రశాంత్ కిషోర్.

రాజకీయ నాయకులు తమ కుటుంబాలు మరియు కొడుకుల గురించి ఆలోచన తప్ప ప్రజల గురించి ఆలోచించే సమయం లేదన్నారు.ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జితన్‌రామ్‌ మాంఝీని కూడా ప్రశాంత్‌ కిషోర్‌ టార్గెట్‌ చేశారు. జితన్‌రామ్‌ మాంఝీ సీఎం కావడం వల్ల ముసాహర్‌ వర్గానికి మేలు జరిగిందా అని ప్రశ్నించారు. ఇప్పుడు యాదవ సమాజంలో పేదలు లేరా? బీహార్‌లో అభివృద్ధిని ఎవరూ పట్టించుకోవడం లేదని పీకే అన్నారు. దీనిపై ప్రజలు దృష్టి సారించాలన్నారు.

Exit mobile version