Site icon HashtagU Telugu

Prakash Raj : చంద్రయాన్-3 పై ప్రకాష్ రాజ్ ట్వీట్.. ఇదేంపని అంటున్న నెటిజన్లు

Prakash Raj Sensational Tweet on Isro Chandrayaan 3 Netizens Trolled

Prakash Raj Sensational Tweet on Isro Chandrayaan 3 Netizens Trolled

ఇస్రో(Isro) చంద్రుడి(Moon)పై ప్రయోగించిన చంద్రయాన్-3(Chandrayaan 3) యావత్ దేశాన్ని గర్వించేలా చేసింది. మరికొద్ది గంటల్లో చంద్రుడిపై అడుగుపెట్టేందుకు చంద్రయాన్-3 అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. చంద్రుడి దక్షిణధృవం ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టనుండగా.. దీనికోసమే అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే.. ఇస్రో సరికొత్త రికార్డు సృష్టించనుంది. ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్(Vikram Lander) అడుగుపెట్టనుందని ఇస్రో వెల్లడించింది.

ఇప్పటికే రష్యా చంద్రుడిపై ప్రయోగించిన లూనా-25 ప్రయోగం విఫలమైన నేపథ్యంలో.. ఇప్పుడు కేవలం భారతీయుల చూపే కాదు.. ప్రపంచదేశాలన్నీ కూడా చంద్రయాన్ -3 వైపే చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినీనటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) విక్రమ్ ల్యాండర్ గురించి చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ప్రకాష్ రాజ్ చేసిన పోస్ట్ లో ఉన్న ఫొటోలో ఒక వ్యక్తి లుంగీ ధరించి ఉండి.. టీ పోస్టున్నట్లు ఉంది. ఈ ఫొటోపైన “బ్రేకింగ్ న్యూస్.. చంద్రుడి నుంచి వస్తున్న మొదటి చిత్రం ఇదే #VikramLander” అని రాశారు. ఇది కార్టూన్ రూపంలోనే ఉన్నా.. చాయ్ పోస్టున్నట్లు ఉండటంతో.. ప్రధాని మోదీని(PM Modi) ఉద్దేశించి పోస్టు పెట్టినట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

అందరూ చంద్రయాన్ -3 గురించి ఎంతో గర్వంగా ఫీలవుతుంటే.. ప్రకాష్ రాజ్ మాత్రం వ్యంగ్యంగా పోస్టు పెట్టడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. దేశానికే గర్వకారణమైన చంద్రయాన్ -3 గురించి ప్రకాశ్ రాజ్ తన స్వార్థపూరితమైన ద్వేషం కోసం ఇస్రో శాస్త్రవేత్తలను ఎగతాళి చేస్తూ ఇలాంటి పోస్టులు చేయడం సరికాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. చంద్రయాన్ -3 ప్రయోగించింది ఇస్రో అని, బీజీపీ కాదని, మీరు విమర్శించాలనుకుంటే ఏదైనా పార్టీని విమర్శించుకోవాలని నెటిజన్లు అంటున్నారు.

 

Also Read : Chandrayaan-3: జాబిల్లిపై ఫోటోలను పంపిన చంద్రయాన్-3…ఫోటోలని విడుదల చేసిన ఇస్రో