Site icon HashtagU Telugu

Prakash Raj: ప్ర‌ధాని మోదీ పై.. మోనార్క్ షాకింగ్ సెటైర్స్..!

Narendra Modi Prakash Raj

Narendra Modi Prakash Raj

న‌టుడు ప్ర‌కాష్ రాజ్ తాజాగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్ అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉండే ఇష్యూస్ పై త‌ర‌చూ వ్యాఖ్య‌లు చేస్తూ ప్ర‌కాష్ రాజ్ వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా రాజ‌కీయ అంశాల‌పై, అలాగే రాజ‌కీయ నాయ‌కుల పై ప్ర‌కాష్ రాజ్ తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు చేస్తుంటారు. అయితే ఇప్పుడు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పై సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు ఎవ‌రి మాటా విన‌ని మోనార్క‌.

ఇక అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళితే.. ఇటీవ‌ల మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ మాట్లాడుతూ.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ రోజుకు రెండు గంటలు మాత్రమే నిద్ర పోతారని, ప్ర‌తి రోజు ఆయ‌న 22 గంటల పాటు పని చేస్తార‌ని చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. చంద్ర‌కాంత్ వ్యాఖ్య‌ల పై ఇత‌ర పార్టీ నేత‌లు ఓరేంజ్‌లో సెటైర్స్ వేస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా చంద్ర‌కాంత్ పాటిల్ వ్యాఖ్య‌ల పై స్పందించిన ప్ర‌కాష్ రాజ్ వెట‌కారంగా స్పందించారు.

దయచేసి మీరు కూడా కొంచెం కామన్సెన్స్ ఉపయోగించండి. ఎవరైనా సరే రోజుకు ఇరవై రెండు గంటలు పనిచేస్తున్నారు అంటే వారికి ఏదైనా జబ్బు ఉందని గమనించాలి.. నిద్రపోలేకపోవడం అనేది అతి పెద్ద జబ్బు అని.. దీనిని వైద్య పరిభాషలో ఇన్సోమ్నియా అని పిలుస్తారని ప్ర‌కాష్ రాజ్ తెలిపారు. అంతటితో ఆగ‌ని ప్ర‌కాష్ రాజ్ ఈ జబ్బు గురించి గొప్పగా చెప్పుకోవడం కాదు, వెంటనే ఆ జబ్బుతో బాధ పడుతున్న మీ నాయకుడికి చికిత్స అందించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌కాష్ రాజ్ కామెంట్స్ చేశారు. మ‌రి మోదీ పై మోనార్క్ చేసిన కామెంట్స్ పై కాషాయ ద‌ళం ఎలా స్పందిస్తుందో చూడాలి.