Prajwal : రేపు భారత్‌కు రానున్న ప్రజ్వల్‌ రేవణ్ణ..ఎయిర్‌పోర్టులో అరెస్టు..!

  • Written By:
  • Publish Date - May 29, 2024 / 12:21 PM IST

Prajwal Revanna: మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీ(ఎస్‌) నాయకుడు, హసన్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ రేపు భారత్‌కు(India) రానున్నట్లు తెలుస్తుంది. లైంగిక దౌర్జన్యం ఆరోపణల అనంతరం ఏప్రిల్‌ 26 తర్వాత ఆయన దేశం విడిచి దౌత్య పాస్‌పోర్టుతో విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. అయితే తాను మే 31న జరిగే విచారణకు తప్పకుండా హాజరవుతానని ఇటివల ప్రజ్వల్‌ వీడియో విడుదల చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలోనే మే 30న జర్మనీ(Germany)లోని మ్యూనిచ్‌ నుంచి అతడు భారత్‌కు బయల్దేరనున్నట్లు పీటీఐ వర్గాలు వెల్లడించాయి. మే 31న ఉదయం 10 గంటలకు అతడు సిట్‌ ముందు హాజరు కావాల్సి ఉంది. మరోవైపు ఈ కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయంలో ప్రజ్వల్‌ కోసం నిఘా పెట్టింది. విమానాశ్రయంలో ప్రజ్వల్‌ ల్యాండ్‌ కాగానే అతడిని అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Read Also: YS Jagan : జగన్ మెజారిటీ టాప్ 10లో ఉండదు..!

కాగా, జేడీఎస్-బీజేపీ కలిసి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఎన్నికల తర్వాత ఏప్రిల్ 27న జర్మనీకి పారిపోయారు ప్రజ్వల్ రేవణ్ణ. ప్రజ్వల్ హసన్ ఎంపీగా ఉన్నారు. మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ మనవడు. భారత అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. అటువంటి వ్యక్తిపై లైంగిక వేధింపుల కేసు నమోదవడంపై బీజేపీ సైతం చాలా తీవ్రంగా స్పందించింది. మహిళలను అగౌరవపరిచే వారిని, కించపరిచే వారిని ఎవరినీ బీజేపీ ఉపేక్షించబోదని, ఈ విషయంలో మా స్టాండ్ స్పష్టంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. జేడీఎస్ భాగస్వామి పక్షమైనా సరే అటువంటి వారిని ఉపేక్షించేది లేదని, చట్టపరమైన చర్యలకు మద్దతిస్తామని చెప్పడం జరిగింది.