Aadhaar : ఇంటివద్దే ఆధార్ అప్ డేట్…48 వేల మంది పోస్ట్ మేన్ లకు ట్రైనింగ్..!!

ఆధార్ ప్రాముఖ్యత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ఆధారం కావాలన్నా ఆధార్ కావాల్సిందే. ప్రభుత్వ, ప్రైవేటు, బ్యాంకింగ్ లావాదేవీలకు ఆధార్ తో ఎంతో ముఖ్యమైంది

  • Written By:
  • Updated On - June 7, 2022 / 09:46 AM IST

ఆధార్ ప్రాముఖ్యత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ఆధారం కావాలన్నా ఆధార్ కావాల్సిందే. ప్రభుత్వ, ప్రైవేటు, బ్యాంకింగ్ లావాదేవీలకు ఆధార్ తో ఎంతో ముఖ్యమైంది. అయితే ఆధార్ లో తప్పులు సరిచేయించుకునేందుకు ప్రజలు ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీనిపై ఎన్నోవిమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఆధార్ లో మార్పులకు సంబంధించిన సేవలను ఇంటిదగ్గరే అందించేలా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI)చర్యలు తీసుకుంటోంది.

ఈ మేరకు దేశవ్యాప్తంగా 48వేల మంది పోస్టు మేన్ లకు ట్రైనింగ్ ఇస్తోంది. వారికి ఆధార్ కిట్ తో పాటు డెస్క్ టాప్, ల్యాప్ టాప్ లను అందిస్తోంది. ఆధార్ తో మొబైల్ ఫోన్ నెంబర్ అనుసంధానం చేయడం, ఇతవ అప్ డేట్స్ చేయడం, బాలల వివరాలను ఆధార్ లో నమోదు చేయడం వంటి విధులను వారికి అప్పగించనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా పోస్ట్ మేన్ లకు 13వేల మంది బ్యాంకింగ్ ప్రతినిధులు కూడా సహకరించనున్నారు. పోస్టు మెన్స్ సేకరించిన వివరాలు వీరు అప్ డేట్ చేయనున్నారు.

కాగా దేశంలో మారుమూల ప్రాంతాల్లోనూ ఆధార్ సేవలు అందిండమే లక్ష్యమని UIDAI పేర్కొంది. ప్రస్తుతం ట్యాబ్, మొబైల్ ఫోన్ ద్వారా పోస్ట్ మెన్ లు పైలెట్ ప్రాజెక్టు కింద చిన్న పిల్లల వివరాలను నమోదు చేపడుతున్నారని వివరించింది.