1899 Jobs : పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో 1899 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. విద్యార్హతతో పాటు స్పోర్ట్స్ కోటా కింద ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వివరాల్లోకి వెళితే.. 598 పోస్టల్ అసిస్టెంట్ పోస్టులు, 143 సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులు, 585 పోస్ట్‌మ్యాన్ పోస్టులు, 03 మెయిల్ గార్డ్ పోస్టులు, 570 ఎంటీఎస్ పోస్టులను రిక్రూట్ చేస్తున్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు. పోస్టల్ అసిస్టెంట్ జాబ్‌కు ఎంపికయ్యే వారికి పే స్కేల్ రూ.25,500 నుంచి రూ. 81,100 దాకా ఉంటుంది. సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు పే స్కేల్ రూ.25,500 నుంచి రూ. 81,100 దాకా, పోస్ట్‌మ్యాన్ పోస్టులకు పే స్కేల్ రూ.21,700 నుంచి రూ.69,100 దాకా, మెయిల్ గార్డ్ పోస్టులకు పే స్కేల్ రూ.21,700 నుంచి రూ.69,100 దాకా, ఎంటీఎస్ పోస్టులకు పే స్కేల్ రూ.18,000 నుంచి రూ.56,900 దాకా(1899 Jobs) ఉంటుంది.
We’re now on WhatsApp. Click to Join.
పైన పేర్కొన్న పోస్టులను కొన్నింటికి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత ఉంది. దీనితో పాటు సంబంధిత క్రీడాంశంలో క్వాలిఫై అయి ఉండాలి. అభ్యర్థుల వయసు ఎంటీఎస్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య, మిగిలిన పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది డిసెంబర్ 9. పూర్తి వివరాలను https://dopsportsrecruitment.cept.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.