న్యాయవ్యవస్థ పై కాంగ్రెస్ పార్టీ వెటరన్ లీడర్లు గులాంనబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యవస్థ మరింత దిగజారిపోయిందని ఆందోళన చెందాడు. న్యాయమూర్తుల నియామకంలో ఉద్దేశపూర్వక జాప్యం గురించి ప్రస్తావించాడు. న్యాయవాదులు ఉన్నారుగానీ, న్యాయమూర్తుల కొరత బాగా ఉందని వివరించాడు. న్యూఢిల్లీలో జరిగిన స్వర్గీయ లలిత్ నారాయణ్ మిశ్రా 99వ జయంతి సభలో ఆ మేరకు ఆజాద్ సంచలన కామెంట్స్ చేశాడు. న్యాయ వ్యవస్థ గురించి నైరాశ్యాన్ని వెలుబుచ్చాడు.
పతనమవుతోన్న రాజకీయ విలువలు, మతతత్త్వం గురించి ఆజాద్ చేసిన వ్యాఖ్యలు ఆలోచింప చేస్తున్నాయి. ప్రస్తుత రాజకీయాలు కేవలం డబ్బు సంపాదన కోసమంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో పనిచేసిన ఆజాద్ ప్రస్తుత రాజకీయాలపై కూలకుషంగా మాట్లాడారు. కేవలం కీర్తి లేదా డబ్బు కోసం మాత్రమే రాజకీయాల్లొకి వస్తురని విశదీకరించాడు. ప్రజా సేవ చేయడానికి ముందుకు రావడంలేదని ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వాళ్లకు చురకలంటించాడు.
భారత సమాజంలో పెరిగిన మతతత్త్వంపై ఆజాద్ సున్నితంగా మందలించాడు. మతపరమైన సమస్యలపై జరుగుతున్న రాజకీయాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆజాద్ పరోక్షంగా బీజేపీని టార్గెట్ చేశాడు. “మిశ్రా తరం నాయకులు ఏ మతాన్ని అవహేళన చేయలేదు. వారు మతాన్ని వ్యక్తిగత స్థాయిలో ఉంచారు. వారు ఏ మతం వాళ్లు అయినప్పటికీ లౌకికవాదులుగా ఉండే వాళ్లను గుర్తు చేశాడు.
నారాయణ్ మిశ్రా 1973 నుండి 1975 వరకు రైల్వే మంత్రిగా పనిచేశారు. ఆయనను భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ పార్లమెంటరీ కార్యదర్శిగా చేస్తున్నప్పుడు బీహార్ మొదటి ముఖ్యమంత్రి కృష్ణ సిన్హా రాజకీయాల్లోకి తీసుకువచ్చాడు. మిశ్రా 99వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ సీనియర్లు పాల్గొన్న ఆ సభలో ఆజాద్ న్యాయ, రాజకీయ వ్యవస్థలతో పాటు మతపరమైన భావజాలాన్ని తప్పుబట్టడం చర్చనీయాంశం అయింది.
Ghulam Nabi Azad: న్యాయవ్యవస్థపై షాకింగ్ కామెంట్స్

Ghulam nabi azad