Site icon HashtagU Telugu

Budget Controversy: చంద్రబాబు, నితీష్ మినహా బడ్జెట్ ని ఏకేస్తున్న నేతలు

Budget Controversy

Budget Controversy

Budget Controversy: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై రాజ్యసభలో చర్చ జరగనుంది. దీంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌కు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌పై కూడా చర్చించనున్నారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కేంద్ర బడ్జెట్‌ను పక్షపాతం, పేదల వ్యతిరేక బడ్జెట్‌గా అభివర్ణించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు సభలో ఈ విషయాలపై రచ్చ జరిగే అవకాశం ఉంది.

ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా బడ్జెట్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నితీష్‌ కుమార్‌, చంద్రబాబు నాయుడు అనే ఇద్దరు నేతలు మినహా దాదాపు అందరూ నిరాశకు గురయ్యారని, దేశంలో ఆదాయం పెరగడం లేదని, ధరలు పెరుగుతున్నాయని ఆర్థిక నివేదికలన్నీ తేల్చాయని ఆయన చెప్పారు. పెట్టుబడిదారులను ప్రభుత్వం కుంగదీసిందన్నారు. ఈ బడ్జెట్ సమాజంలోని అన్ని వర్గాలను ఆగ్రహానికి గురిచేసిందని అసహనం వ్యక్తం చేశారు.

కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగోయ్‌ మాట్లాడుతూ.. ‘బడ్జెట్‌పై దేశం మొత్తం ఉలిక్కిపడిందని.. తమ ప్రాథమిక సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ విఫలమవడంతో అన్ని రాష్ట్రాల ప్రజలు కలత చెందుతున్నారని.. ప్రభుత్వ నిస్సహాయత ఈ బడ్జెట్‌లో స్పష్టంగా కనిపిస్తోందని కేంద్రాన్ని ఎద్దేవా చేశారు. ఇక సాధారణ బడ్జెట్‌పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తన స్పందన తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను కూటమికి సంబంధించిన ఒప్పందంగా అభివర్ణించారు. ఈ బడ్జెట్‌లో తమిళనాడును విస్మరించారని, రాష్ట్రానికి ద్రోహం చేశారని అన్నారు. జులై 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి కూడా హాజరుకావడం లేదని ఆయన తెలియజేశారు.

పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కాకముందే కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ స్పందించారు. “ఈ బడ్జెట్‌లో చాలా రాష్ట్రాలకు అన్యాయం జరిగిందన్నారు. కేరళ ఆరోగ్య రంగంలో కొన్ని అంచనాలు ఉన్నాయి, కానీ అవన్నీ నెరవేరలేదు. ప్రతి రాష్ట్రానికి దాని స్వంత సమస్యలు ఉన్నాయి అని ఆయన అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా బడ్జెట్ పై మండిపడ్డారు. ప్రభుత్వాన్ని రక్షించిన సంకీర్ణ భాగస్వామ్య పక్షాలకు మాత్రమే బడ్జెట్ హెల్ప్ అయిందని స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి పటిష్టమైన చర్యలు తీసుకోలేకపోయిందని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్‌కు ఏమీ రాలేదు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం నుండి యుపికి రెట్టింపు ప్రయోజనం లభించాలి. కాబట్టి డబుల్ ఇంజిన్ ఉపయోగం ఏమిటి అని అయన ప్రశ్నించారు.

Also Read: Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్ ఛాతిలో నొప్పి, ఎయిమ్స్ లో చికిత్స