Site icon HashtagU Telugu

Himachal Heat : కాంగ్రెస్ సర్కారుకు షాక్.. ఆరుగురు ఎమ్మెల్యేలు జంప్

Himachal Heat

Himachal Heat

Himachal Heat : హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో తగినంత మెజారిటీ లేనప్పటికీ.. అక్కడి రాజ్యసభ సీటును బీజేపీ గెల్చుకుంది. ఈ షాక్ నుంచి కోలుకోక ముందే.. హిమాచల్‌లోని కాంగ్రెస్ సర్కారుకు మరో షాక్ తగిలింది.  రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని.. తన తండ్రి, దివంగత కాంగ్రెస్ నేత వీరభద్ర సింగ్‌ను సీఎం అగౌరవపరిచారని విక్రమాదిత్య ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు బలపరీక్ష నిర్వహించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం బీజేపీ సీనియర్ నేత, ప్రతిపక్ష నేత జైరాం ఠాకూర్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని కోరారు. ప్లోర్ టెస్ట్ సహా కట్‌ మోషన్‌, ఆర్థిక బిల్లుపై ఓటింగ్ చేపట్టాలని తెలిపారు. ‘‘గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ విజయం సాధించారు. దీంతో అధికారంలో కొనసాగే నైతిక హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోయింది’’ అని జైరాం ఠాకూర్ ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join

34కు పెరిగిన బీజేపీ సంఖ్యా బలం

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్‌ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. సీఎంను మార్చాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో గత 14 నెలలుగా కొనసాగుతున్న సుఖు ప్రభుత్వాన్ని  టెన్షన్ చుట్టుముట్టింది. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిమ్లా నుంచి హర్యానాకు వెళ్లారని, వారు బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ యాక్టివ్‌ అయింది.ఈ సంక్షోభాన్ని పరిష్కరించే బాధ్యతను హర్యానా మాజీ సీఎం భూపేంద్ర హుడా, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లకు అప్పగించింది. వీరిద్దరూ కాసేపట్లో హిమాచల్ రాజధాని సిమ్లాకు చేరుకోనున్నారు.

Also Read :10 Lakhs Fine : ఐటీఆర్‌లో ఇవి నింపకుంటే 10 లక్షల ఫైన్‌