Delhi Crime : ఢిల్లీ వెళ్తున్నారా జాగ్ర‌త్త‌.. రోడ్డుమీద క‌నిపిస్తే లాక్కెళుతున్నారు. షాకింగ్ రిపోర్ట్ ఇదే!

ఢిల్లీలో గత నెలలో సుమారు 752 స్నాచింగ్ ఘటనలు నమోదయ్యాయి . అంటే సగటున రోజుకు 24 కేసులు న‌మోదు అయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో 597 నమోదయ్యాయిన‌ట్లు పోలీసుల డేటాలో చూపిస్తుంది.

  • Written By:
  • Publish Date - April 25, 2022 / 09:00 AM IST

ఢిల్లీలో గత నెలలో సుమారు 752 స్నాచింగ్ ఘటనలు నమోదయ్యాయి . అంటే సగటున రోజుకు 24 కేసులు న‌మోదు అయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో 597 నమోదయ్యాయిన‌ట్లు పోలీసుల డేటాలో చూపిస్తుంది. గత నాలుగు నెలల్లో 1,746 మందిని అరెస్టు చేశారు, వీరిలో 1,237 మంది మొదటిసారి దొంగ‌త‌నాల‌కు పాల్పడిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ పోలీసు హెడ్ క్వార్ట‌ర్స్‌లో శనివారం పోలీసు కమిషనర్‌ ప్రత్యేక సీపీలు, జాయింట్‌ సీపీలు, 15 జిల్లాల డీసీపీలతో నేర సమీక్షా సమావేశంలో దీనిపై చర్చించారని.. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు జిల్లా పోలీసుల ముందస్తు వ్యూహాలపై చర్చించినట్లు పోలీస్ ఉన్న‌తాధికారి తెలిపారు.

ఈ సంవత్సరం పోలీసుల డేటా ప్రకారం.. ఏప్రిల్ 20 వరకు మొత్తం 3,063 స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో 2,899 స్నాచింగ్‌, 735 దోపిడీ ఘటనలు జరగగా.. ఈ ఏడాది 890 దోపిడీ ఘటనలు జరిగాయి. గత సంవత్సరం 1,578 నమోదవగా.. ఈ సంవత్సరం 4,749 ఇంటి దొంగతనం/దోపిడీ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 20 వరకు 1,746 మందిని అరెస్టు చేశారు. 1,237 మంది మొదటిసారి నేరస్థులు కాగా, 509 మంది నేర చరిత్ర కలిగి ఉన్నారు. దోపిడీ కేసుల్లో, 1,526 మందిని అరెస్టు చేశారు. వీరిలో 1,032 మంది మొదటి సారి కాగా, 494 మంది రికార్డు కలిగి ఉన్నారు. ఇంటి దొంగతనం/దోపిడీ కేసుల్లో అరెస్టయిన 1,234 మందిలో 897 మంది మొదటిసారి నేరస్తులు కాగా, వారిలో 337 మంది నేర చరిత్ర కలిగి ఉన్నారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

మార్చి 24 నుండి ఏప్రిల్ 20 మధ్య ఒక నెల సమీక్షలో గత సంవత్సరం తక్కువ స్నాచింగ్ కేసులు నమోదైన అనేక జిల్లాలు ఈ సంవత్సరం స్పైక్‌ను చూశాయని ఒక అధికారి తెలిపారు. ఈశాన్య జిల్లాలో గత సంవత్సరం 75 సంఘటనలతో పోలిస్తే ఈ సంవత్సరం 102 సంఘటనలు నమోదయ్యాయి. వాయువ్య జిల్లాలో గత సంవత్సరం 35 సంఘటనలు జరిగాయి. పోలీస్ చీఫ్ కేసుల పరిష్కారం, రికవరీ శాతాన్ని కూడా విశ్లేషించారు.స్నాచింగ్ కేసుల్లో పరిష్కరించబడిన శాతం 52%, రికవరీ 17%; దోపిడీ కేసుల్లో పరిష్కరించబడిన శాతం 91%, రికవరీ 53%. దొంగతనాల విషయానికి వస్తే, రికవరీ 10%, ”అని పోలీస్‌ అధికారి చెప్పారు.