Site icon HashtagU Telugu

Delhi : గ్రేటర్ నోయిడాలో రైతులపై పోలీసుల లాఠీఛార్జ్..!!

Police

Police

గ్రేటర్ నోయిడాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లోపల భారతీయ కిసాన్ పరిషత్ కు చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైతులపై లాఠీచార్జీ చేసిన పోలీసులు టియర్ గ్యాస్ ఉపయోగించారు. ఈ ఘటనలో మహిళా రైతులు గాయపడ్డారు.

గ్రేటర్ నోయిడాలోని దాద్రీ సమీపంలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ కు చెందిన పవర్ ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్ ఏర్పాటు కోసం 35ఏళ్ల క్రితం 23 గ్రామాల్లో భూమిని సేకరించారు. దీనికోసం అప్పటి ప్రభుత్వం రైతులకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చినప్పటికీ…ఇప్పటివరకు ఒక్కటి కూడా అమలు చేయలేదు. భూసేకరణ వల్ల నష్టపోయిన రైతులకు ఎన్టీపీసీలో ఉపాధి అవకాశాలు, సమాన పరిహారం అందడం లేదు. ఈ డిమాండ్లపై భారతీయ కిసాన్ పరిషత్ ఈ అంశాన్ని లేవనెత్తింది. ఇవాళ యోగి ఆదిత్యనాథ్ నోయిడాలో ప్రాజెక్టు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కోసం చేరుకున్నారు. ఈనేపథ్యంలోనే తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ రైతలు ఆందోళనకు యత్నించారు. వారిని అడ్డుకున్న పోలీసులు…లాఠీఛార్జీ చేశారు.