National Police Memorial Day 2023 : మీ త్యాగం మరువం

1959న లడఖ్‌ సరిహద్దులో కాపలాగా ఉన్న పది మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు చైనా సైన్యంతో విరోచితంగా పోరాడి ప్రాణాలర్పించారు. అమరులైన సైనికులతోపాటు విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల త్యాగాలను అక్టోబర్‌ 21న స్మరించుకుని, నివాళులర్పిస్తారు

  • Written By:
  • Publish Date - October 21, 2023 / 11:47 AM IST

National Police Memorial Day 2023 : నీది నాది అనే తేడాలుండవ్..పని గంటలు లెక్కే ఉండదు..త్యాగాలకు అస్సలు హద్దే ఉండదు..వారికీ తెలిసిందల్లా ఒక్కటే అదే డ్యూటీ..దేశం కోసం , సమాజం కోసం వారు చేసే త్యాగాలు మరవలేనిది..ప్రజల కాపాడేందుకు వారి ప్రాణాలకు సైతం లెక్కచేయరు. అలాంటి త్యాగాలకు గుర్తుగా ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (National Police Memorial Day) జరుపుకుంటాం. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబరు 21న జరుపుకుంటాం.

1959న లడఖ్‌ సరిహద్దులో కాపలాగా ఉన్న పది మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు చైనా సైన్యంతో విరోచితంగా పోరాడి ప్రాణాలర్పించారు. అమరులైన సైనికులతోపాటు విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల త్యాగాలను అక్టోబర్‌ 21న స్మరించుకుని, నివాళులర్పిస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

భారత్-చైనా సరిహద్దుల్లోని ఆక్సయ్ చిన్ ప్రాంతంలో 16 వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటిబుగ్గ (హాట్ స్ప్రింగ్స్) అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది. దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అసువులుబాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచే ఆరంభమైంది. మిలటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దులోని భారత భూభాలైన లడఖ్, సియాచిన్ ప్రాంతాలు కీలకమైనవి. సరిహద్దు భద్రతాదళం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతాదళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే బాధ్యతను కేంద్ర రిజర్వు పోలీస్ ఫోర్స్ (CRPF) బలగాలు నిర్వర్తించేవి. 1959 అక్టోబరు 21న డీఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ కు చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుండగా, చైనా రక్షణ బలగాలు సియాచెన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సీఆర్పీఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో దీటుగా ఎదురొడ్డి పోరాడింది. ఆ పోరాటంలో పది మంది భారత జవాన్లు ప్రాణాలను కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను స్మరించుకుంటూ.. వారికి నివాళులు అర్పిస్తూ దేశ వ్యాప్తంగా నేడు పోలీసులు ర్యాలీలు నిర్వహిస్తూ, క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహిస్తూ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తుంటారు.

ఈఏడాది కూడా అలాగే నిర్వహిస్తున్నారు. తెలంగాణలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్‌భంగా గోషామహల్ స్టేడియంలో ఫ్లాగ్ డే (Flag Day) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ అంజనీకుమార్ (DGP Anjani Kumar) సహా ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీస్ అమరవీరులకు డీజీపీ, పోలీస్ ఆఫీసర్స్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ కంటింజెంట్స్ పరేడ్ నిర్వహించారు. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 189 పోలీసులు అమరులయ్యారని డీజీపీ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలోని నేషనల్ పోలీస్ మెమోరియల్ వద్ద జరిగిన జాతీయ పోలీస్ స్మారక దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Home Minister Amit Shah) పాల్గొన్నారు. పోలీసుల అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు.

Read Also :