Site icon HashtagU Telugu

Gujarat : కొంటె తాత.. వయసేమో 60, మనసేమో 20.. కుర్రాడి ముసుగులో అమ్మాయిలకు గాలం..!!

Cyber Crime

Cyber Crime

20 ఏళ్ల అమ్మాయి.. నగ్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన 63 ఏళ్ల వృద్ధుడ్ని అరెస్టు చేసిన ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. వృద్ధుడి పేరు రసిక్ వదాలియా. జంజోథ్ పూ్ లోని సిద్ధసర్ గ్రామానికి చెందిన రసిక్ వదాలియా రైతు. పదవ తరగతి వరకు చదువకున్నాడు. సిద్ధసర్ గ్రామంలో భార్యతో కలిసి ఉంటున్నాడు. అతని కుమారుడు ఓ ఐటీ కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ మధ్యే తన నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం గురించి కాలేజీ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

విచారణ చేపట్టిన పోలీసులు ఈపని రసిక్ వదాలియా చేసినట్లు గుర్తించారు. అతడ్ని అరెస్టు చేసి ప్రశ్నించడంతో మరిన్ని విషయాలు బయటకు వచ్చాయి. తాను ఓ కాలేజీ విద్యార్థినంటూ ఆన్ లైన్ లో అమ్మాయిలతో పరిచయాలు పెంచుకుని వారి నగ్న చిత్రాలు సేకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రిషి పటేల్ పేరు మీద ఇన్ స్టాగ్రామ్ లో ఫేక్ అకౌంట్ ను క్రియేట్ చేసి కొనసాగిస్తున్నాడు. కొన్ని వెబ్ సీరిస్ లు చూసి ఇలా పెడతోవ పట్టాడని పోలీసులు తెలిపారు. అయితే అమ్మాయిలతో ఆన్ లైన్లో పరిచయం పెంచుకుని తన పై వారికి నమ్మకం వచ్చేలా చేసిన నగ్న చిత్రాలు పంపమని అడిగేవాడు. ఇలా అతడి ఉచ్చులో చిక్కుకుని నగ్న చిత్రాలు పంపినవారిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.

కానీ అతను డబ్బు డిమాండ్ చేయడు. ఇతర కాలేజీ అమ్మాయిలను పరిచయం చేయాలని డిమాండ్ చేస్తాడు. లేదంటే నగ్న ఫోటోలు బయటపెడతానంటూ బెదిరించేవాడు. ఇలా రెండేళ్లుగా రసిక్ ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. ఓ అమ్మాయి ఫిర్యాదుతో ఇంస్టాగ్రామ్ ఐడీ, ఐపీ అడ్రస్ ఆధారంగా అతడ్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version