గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు తన సొంత రాష్ట్రంలో మోడీ పర్యటించనున్నారు. బీజేపీ నిర్వహిస్తున్నా దీపావళి ఈవెంట్‌లో పాల్గొనడం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని సందర్శించడం వంటివి ఈ టూర్‌లో జరగనున్నాయి. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌లలో ఒకరైన ప్రధాని ఆదివారం మధ్యాహ్నం 2:20 గంటలకు వడోదర విమానాశ్రయంలో దిగుతారని అధికారులు తెలిపారు.
గుజరాత్‌లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది… అయితే ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. గుజరాత్ చేరుకున్న తర్వాత ప్రధాని మోదీ మొదట వడోదరలోని లెప్రసీ గ్రౌండ్‌కు వెళతారు. అక్కడ భారత వైమానిక దళానికి చెందిన టాటా-ఎయిర్‌బస్ విమానాల తయారీ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రధాని మోదీ సర్క్యూట్ హౌస్ ఏక్తానగర్ (కెవాడియా)లో రాత్రి బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో 8:15 గంటలకు ఐక్యతా కవాతు నిర్వహించనున్నారు. అనంతరం అహ్మదాబాద్‌కు వెళ్లి పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి అనంతరం గాంధీనగర్‌లో రాత్రి బస చేస్తారు. ప్రధాని మోదీ తన తల్లి హీరాబాను కలిసి ఆమె ఆశీస్సులు తీసుకునే అవకాశం ఉంది