Site icon HashtagU Telugu

Parliament security breach: పార్లమెంట్ ఘటనపై మోడీ సీరియస్.. ఎనిమిది మంది ఉద్యోగులు సస్పెండ్

Parliament security breach

Parliament security breach

Parliament security breach: డిసెంబర్ 13వ తేదీ బుధవారం ఇద్దరు యువకులు లోక్‌సభలోకి దూసుకొచ్చి హంగామా సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇవాళ పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర చర్చ కొనసాగింది. కాగా ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి ఆయన ఈరోజు కేంద్ర మంత్రులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

పార్లమెంట్‌లో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం సీనియర్ మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, అనురాగ్ ఠాకూర్ హాజరయ్యారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా యువకులు లోక్‌సభను ముట్టడించాడు. శీతాకాల సమావేశాలు ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు పార్లమెంట్ భద్రతపై నినాదాలు చేశారు. శాంతిభద్రతల లోపంపై ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పెద్ద దుమారం రేగింది. అధికార మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా భద్రతా వ్యవస్థలో జరిగిన పొరపాటును క్షమించరాని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఎనిమిది మంది ఉద్యోగులను లోక్‌సభ సెక్రటేరియట్ సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.

Also Read: OU Students: ఓయూ యూనివర్సిటీ విద్యార్థుల నిరసన