PM New Scheme: మోడీ కొత్త పథకం ‘స్కూల్స్ ఫ‌ర్ రైజింగ్ ఇండియా’

దేశంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ  కొత్త పథకాన్ని ప్రకటించారు.

  • Written By:
  • Updated On - September 6, 2022 / 11:49 AM IST

దేశంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ  కొత్త పథకాన్ని ప్రకటించారు. ప్ర‌ధాన మంత్రి స్కూల్స్ ఫ‌ర్ రైజింగ్ ఇండియా -పీఎం- శ్రీ యోజ‌న పేరిట వివ‌రాల‌ను ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేసిన‌ ట్వీట్ల‌లో వెల్ల‌డించారు. దీని ప్రకారం, పీఎం- శ్రీ యోజ‌న పేరిట దేశంలోని 14 వేల 500 ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను అభివృద్ధి చేయ‌నున్నారు.

ఈ పథకం వల్ల ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు మోడ‌ల్ స్కూళ్లుగా మార‌తాయ‌ని, అత్యాధునిక సౌకర్యాలు ఎంపిక చేసిన ఈ స్కూళ్లకు కలిపిస్తామని ప్ర‌ధాని ప్ర‌క‌టించారు. ఈ ప‌థ‌కం ద్వారా ప్ర‌భుత్వ విద్యాల‌యాల్లో విద్య‌న‌భ్య‌సిస్తున్న ల‌క్ష‌లాది మంది విద్యార్థుల‌కు ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌ని మోదీ పేర్కొన్నారు.