Site icon HashtagU Telugu

Modi Victory Speech: బీజేపీ కొత్త చరిత్రను లిఖించింది!

Pm Modi

Pm Modi

ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్‌లలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని ‘భారత్ మాతా కీ జై’ నినాదాలతో ప్రారంభించి, పార్టీని నమ్మి నాలుగు రాష్ట్రాల్లో మళ్లీ అధికారంలోకి వచ్చినందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ తన విజయోత్సవ ప్రసంగంలో పలు అంశాలను ప్రస్తావించారు.

గోవా, ఉత్తరాఖండ్‌లో సర్వేలన్నీ తప్పని తేలింది

గోవా, ఉత్తరాఖండ్‌లలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పని రుజువయ్యాయని ప్రధాని మోదీ అన్నారు. “గోవాలో అన్ని ఎగ్జిట్ పోల్స్ తప్పని రుజువైంది, ఉత్తరాఖండ్‌లో బీజేపీ కొత్త చరిత్రను లిఖించింది. రాష్ట్రంలో తొలిసారిగా ఒక పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది” అని ప్రధాని మోదీ అన్నారు.

మార్చి 10 నుంచి హోలీ

పార్టీ కార్యకర్తలను అభినందిస్తూ, వారు తమ సత్తాను నిరూపించుకున్నారని ప్రధాని మోదీ అన్నారు. “కొందరు పార్టీ కార్యకర్తలు నాకు చెప్పారు. మార్చి 10 న హోలీ జరుపుకుంటారు. వారు తమ సత్తాను నిరూపించుకున్నారు.” రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చిందన్నారు.

“నేను ఇప్పుడు యూపీవాలా”

ఉత్తరప్రదేశ్ ప్రజలు తమ ప్రేమ, ఆప్యాయతలతో తనను యూపీ వాలాగా మార్చారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. “యుపి ప్రజలు అర్థం చేసుకున్నారు. వారు ఇకపై కుల ప్రాతిపదికన ఓటు వేయరు.

రాజకీయాల స్థాయిని దిగజార్చుతున్నారు

“ఈ రోజు, నేను నా ఆందోళనలలో కొన్నింటిని పంచుకోవాలనుకుంటున్నాను. దేశ అభివృద్ధిలో సామాన్యులు పాల్గొంటున్నారు. కానీ కొంతమంది రాజకీయాల స్థాయిని దిగజార్చుతున్నారు. మా టీకా కార్యక్రమాన్ని ప్రపంచం ప్రశంసించింది. కానీ కొందరు మాత్రం మమ్మిల్ని తప్పుపట్టారు.

బీజేపీ పంజాబ్ అవకాశాలపై

“పంజాబ్‌లో బీజేపీ ఉనికిని చాటింది. మన పంజాబ్ కార్యకర్తలు క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పటికీ పార్టీని, మా జెండాను గర్వపడేలా చేశారు.

https://twitter.com/narendramodi/status/1501960781478318099

Exit mobile version