PM Modi Bill Gates Meet: వ్యర్ధాలతో తయారైన ప్రధాని మోడీ జాకెట్

ప్రధాని నరేంద్ర మోడీ, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మధ్య జరిగిన భేటీలో ఆసక్తికర అంశాలపై చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నుండి ఆరోగ్యం, వాతావరణం మరియు రీసైక్లింగ్ వరకు అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

Published By: HashtagU Telugu Desk
PM Modi Bill Gates Meet

PM Modi Bill Gates Meet

PM Modi Bill Gates Meet: ప్రధాని నరేంద్ర మోడీ, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మధ్య జరిగిన భేటీలో ఆసక్తికర అంశాలపై చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నుండి ఆరోగ్యం, వాతావరణం మరియు రీసైక్లింగ్ వరకు అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధాని మోదీ, బిల్ గేట్స్ మధ్య జరిగిన ఈ చర్చకు సంబంధించిన వీడియో విడుదలైంది. ఈ వీడియోలో ప్రధాని మోదీ భారతదేశంలో సాంకేతికత, ఆవిష్కరణలు మరియు రీసైక్లింగ్ గురించి మాట్లాడారు. దీంతో పాటు తన భవిష్యత్ లక్ష్యాల గురించి కూడా బిల్ గేట్స్‌కు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.

We’re now on WhatsApp : Click to Join

పవన, సౌరశక్తి వంటి రంగాల్లో పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచుకోవడంలో భారత్ శరవేగంగా దూసుకుపోతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అణుశక్తి మరియు గ్రీన్ హైడ్రోజన్‌లో భారతదేశం వేగంగా ముందుకు సాగాలని కోరుకుంటోందని చెప్పారు. అలాగే వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే భారతదేశ సంస్కృతి గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. తాను ధరించిన జాకెట్ రీసైకిల్ మెటీరియల్‌తో తయారైందని ప్రధాని మోదీ అన్నారు. చిన్న చిన్న గుడ్డ ముక్కలను రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ బాటిళ్లను ఇందులో వినియోగించడం దీని ప్రత్యేకత అని ప్రధాని మోదీ తెలిపారు. జాకెట్‌లో నలభై శాతం వ్యర్థమైన ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించారని చెప్పారు.

వినూత్న ఆలోచనలతో యువతను ప్రోత్సహించేందుకు బడ్జెట్‌లో లక్ష కోట్ల కార్పస్ ఫండ్‌ను కేటాయించామని ప్రధాని మోదీ బిల్ గేట్స్‌తో చెప్పారు. యువ తరం వారి కొత్త ఆలోచనలను అందించడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. దీని వల్ల యువతకు 50 ఏళ్లపాటు వడ్డీ లేని రుణం లభిస్తుందని కూడా తెలిపారు.ఇంకా మోడీ మాట్లాడుతూ.మన జీవనశైలిలో మార్పులు రావాలని అన్నారు. వాతావరణానికి అనుకూలమైన జీవితాన్ని గడపడం చాలా ముఖ్యం. ప్రకృతిని గౌరవించే జీవితాన్ని మనం అలవర్చుకోకపోతే ఎన్ని కొత్త ఆవిష్కరణలు చేసినా ఫలితం ఉండదని అభిప్రాయపడ్డారు.

Also Read: Jagan : కేసీఆర్ ఫెయిల్డ్ ప్రచార స్ట్రాటజీని నమ్ముకున్న జగన్..ఏమవుతుందో మరి..!!

  Last Updated: 29 Mar 2024, 05:40 PM IST