Narendra Modi: ప్ర‌ధాన‌మంత్రుల మ్యూజియం ప్రారంభం

భార‌త ప్ర‌ధాన మంత్రుల సేవ‌ల‌కు గౌర‌వ సూచికంగా రూ. 217 కోట్ల వ్య‌యంతో మ్యూజియంను నిర్మించారు.

  • Written By:
  • Updated On - April 15, 2022 / 11:27 AM IST

భార‌త ప్ర‌ధాన మంత్రుల సేవ‌ల‌కు గౌర‌వ సూచికంగా రూ. 217 కోట్ల వ్య‌యంతో అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞాన్ని ఉప‌యోగించి మ్యూజియంను నిర్మించారు. ఆ మ్యూజియాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంత‌రం తొలి టికెట్‌ను కూడా కొనుగోలు చేశారు. ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నుండి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ వరకు అందరి ప్రధానుల జీవితానికి సంబంధించిన సమాచారాన్ని ఈ మ్యూజియంలో వివరంగా పొందుప‌రిచారు. ఆ వివ‌రాల‌ను తెలియ‌చేయ‌డానికి వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఇంటరాక్టివ్ కియోస్క్, మల్టీ మీడియాతో సహా అనేక ఇతర అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించారు. మ్యూజియంలో లైట్ షో కోసం కూడా ఏర్పాట్లు చేశారు. 217 కోట్ల వ్యయంతో 15,600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ మ్యూజియం నిర్మించబడింది.

నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియంగా మార్చిన‌ తర్వాత ప్రధాన మంత్రికి సంబంధించిన అన్ని జ్ఞాపకాలను అందులో ఉంచుతారు. ఇంతకుముందు, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకి సంబంధించిన జ్ఞాపకాలను మాత్ర‌మే ఉంచారు. దీనితో పాటు, ప్రధాన మంత్రులందరి నుండి కొన్ని లేఖలు ఉన్నాయి. ప్రధానమంత్రులు తీసుకున్న నిర్ణయాల గురించి కూడా చెప్పబడింది. వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీతో సహా అనేక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలు ప్రధాన మంత్రులతో ఫోటోలు తీసుకోవచ్చు.
మ్యూజియం గురించి పీఎంవో కార్యాల‌యం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌కారం “దేశ నిర్మాణానికి సేవ‌లు చేసిన ప్రధానమంత్రులందరిని గౌరవించేలా ప్రధానమంత్రి మ్యూజియం నిర్మించబడింది.

ఇది భారతదేశ మాజీ ప్రధానమంత్రులందరికీ నివాళి. భారతీయ పౌరులకు, ప్రధానమంత్రి మ్యూజియంలో రూ. 100 ఆన్‌లైన్ మరియు రూ. 110 ఆఫ్‌లైన్ టిక్కెట్‌ను ఉంచారు. అయితే విదేశీయులకు టిక్కెట్ ధర రూ. 750గా ఉంచబడింది. 5 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల పిల్లలకు 50% తగ్గింపు ఇవ్వబడుతుంది. ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ మోడ్‌లో టిక్కెట్లను కొనుగోలు చేయడం కోసం ఏర్పాట్టు చేశారు.“ మొత్తం మీద నెహ్రూ మ్యూజియంను ప్ర‌ధాన‌మంత్రుల మ్యూజియంగా మార్చేశార‌న్న‌మాట‌.