Modi Bill Gates : బిల్‌గేట్స్‌తో ప్రధాని మోడీ చాయ్‌ పే చర్చ

  • Written By:
  • Publish Date - March 29, 2024 / 11:26 AM IST

 

PM Modi-Bill Gates: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ గత కొద్దిరోజులుగా భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో(PM Modi-Bill Gates) సమావేశయ్యారు. ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో బిల్‌గేట్స్‌తో ప్రధాని మోడీ చాయ్‌ పే చర్చ జరుగుతోంది. కృత్రిమ మేధ‌(ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌) నుంచి డిజిట‌ల్ ప‌బ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌, వాతావ‌ర‌ణ మార్పులు లాంటి అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. అయితే ఆ చ‌ర్చ‌లో భార‌తీయ‌ల‌ను బిల్ గేట్స్ ప్ర‌శంసించారు. టెక్నాల‌జీని భార‌తీయుల చాలా వేగంగా ఆపాదించుకున్నార‌న్నారు. సాంకేతిక రంగంలో భార‌త్ దూసుకెళ్తున్న‌ట్లు కూడా గేట్స్ తెలిపారు. పీఎం న‌మో యాప్‌లో ఉన్న ఫోటో బూత్ ఆప్ష‌న్ ద్వారా బిల్ గేట్స్‌తో ప్ర‌ధాని సెల్ఫీ దిగారు.

డిజిటిల్ విప్ల‌వంలో ఇండియా వేగంగా ముందుకు వెళ్తోంద‌ని, ఆరోగ్యం, వ్య‌వ‌సాయం, విద్యా రంగాల్లో కూడా భార‌త్ ముందుకు వెళ్తోంద‌ని మోడీ అన్నారు. ఇండోనేషియాలో జీ20 శిఖ‌రాగ్ర స‌ద‌స్సు జ‌రిగిన స‌మ‌యంలో భార‌త్‌లో జ‌రుగుతున్న డిజిట‌ల్ విప్ల‌వం గురించి ప్ర‌పంచ దేశాలు త‌మ ఉత్సుక‌త‌ను ప్ర‌ద‌ర్శించాయ‌ని, అయితే ఏక‌ఛ‌త్రాధిప‌త్యాన్ని నిర్మూలించేందుకు టెక్నాల‌జీని ప్ర‌జాస్వామ్యంగా మార్చామ‌ని ఆ స‌ద‌స్సులో చెప్పిన‌ట్లు ప్ర‌ధాని మోడీ తెలిపారు. ప్ర‌జ‌ల చేత‌, ప్ర‌జ‌ల కోసం టెక్నాల‌జీని అందిస్తున్నామ‌న్నారు. జీ20 స‌ద‌స్సు స‌మ‌గ్ర స్థాయిలో జ‌రిగింద‌ని, ఇండియా ఆ స‌ద‌స్సును అద్భుతంగా నిర్వహించింద‌ని బిల్ గేట్స్ పేర్కొన్నారు. భార‌త్‌లో డిజిట‌ల్ విభ‌జ‌న జ‌ర‌గ‌కుండా చూస్తాన‌ని, డిజిట‌ల్ మౌళిక స‌దుపాయాల్ని ప్ర‌తి గ్రామానికి తీసుకువెళ్తాన‌ని ప్ర‌ధాని మోడీ అన్నారు.

కోవిడ్ క‌ట్ట‌డిలో భార‌త్ పాత్ర‌ను ప్ర‌ధాని మోడీ.. బిల్ గేట్స్‌కు వివ‌రించారు. డిజిట‌ల్ రంగంలో భార‌త్ చాలా మార్పులు తీసుకువ‌చ్చింద‌ని ప్ర‌ధాని మోడీ తెలిపారు. విద్యారంగంలో మార్పుల‌కు టెక్నాల‌జీ వినియోగిస్తున్నామ‌న్నారు. జీ20 స‌ద‌స్సులో ఏఐ వినియోగించామ‌న్నారు. టెక్నాల‌జీ అల‌స‌త్వానికి దారి తీయ‌వ‌ద్దు అని పేర్కొన్నారు. ప్ర‌భుత్వం అవ‌స‌రం ఉన్న పేద‌ల‌కు టెక్నాల‌జీ ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. టెక్నాల‌జీ వ‌ల్ల పేద‌ల‌కు అన్నీ అందుతున్నాయ‌న్నారు. చిరుధాన్యాల సాగుతో చిన్న రైతులు అభివృద్ధి చెంద‌తున్నార‌ని తెలిపారు. పెద్ద హోట‌ళ్ల‌లోనూ చిరుధాన్యాల వంట‌కాలు పెరిగాయ‌న్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్ర‌జ‌ల్లో విశ్వాసం, చైత‌న్యం నింపే అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్‌పై అపోహ‌లు, అనుమానాలు నివృత్తి చేశామ‌న్నారు. త‌న‌ త‌ల్లితో క‌లిసి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న‌ట్లు ప్ర‌ధాని మోడీ తెలిపారు. న‌మో డ్రోన్ దీదీ ప‌థ‌కం స‌క్సెస్‌ఫుల్‌గా అమ‌లు అవుతోంద‌న్నారు. స్కూల్ టీచ‌ర్ల కొర‌త‌ను అధిగ‌మించేందుకు ఏఐను వాడుతున్నామ‌న్నారు. డిజిట‌ల్ మార్పుల‌తో దేశానికి ప్ర‌యోజ‌నం జ‌రిగింద‌ని మోడీ అన్నారు.

Read Also: MLC Kavitha: జైలులో కవిత డిమాండ్స్ పై కోర్టు కీలక నిర్ణయం