PM Modi: మోదీ రెండు రోజుల వారణాసి పర్యటన.. హైలైట్స్ ఇవే..!

మోదీ రెండు రోజుల వారణాసి పర్యటనలోని హైలెట్స్ మీకోసం కాశీ విశ్వనాధుడి ధామ్ కారిడార్ మొదటి ఫెజ్ ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. రెండు రోజుల వారణాసి పర్యటనలో మోదీ బిజీబిగా ఆసక్తికరంగా గడిపాడు. ఆయన రెండు రోజుల పర్యటనలో ముఖ్యమైన అంశాలు మీకోసం.

మోదీ రెండు రోజుల వారణాసి పర్యటనలోని హైలెట్స్ మీకోసం

కాశీ విశ్వనాధుడి ధామ్ కారిడార్ మొదటి ఫెజ్ ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. రెండు రోజుల వారణాసి పర్యటనలో మోదీ బిజీబిగా ఆసక్తికరంగా గడిపాడు. ఆయన రెండు రోజుల పర్యటనలో ముఖ్యమైన అంశాలు మీకోసం.

1. వారణాసికి రాగానే మోదీ కాలభైరవ టెంపుల్ వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి హారతి కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు.

2. ఆ తర్వాత వారణాసిలోని లలిత ఘాట్ లో గంగానది స్నానాన్ని చేశారు.పవిత్ర గంగా నదిలో స్నానాన్ని చేయడం వేలాది సంవత్సరాలుగా వస్తోన్న భారతీయ సంస్కృతిలో భాగమని మోదీ తెలిపారు.

3. ప్రధాని మోదీ కాశీ విశ్వనాధుడి ధామ్ కారిడార్ ఫస్ట్ ఫేజ్ ప్రారంభించారు. ఈ కారిడార్ గతంలో ఉన్న మూడువేల చదరపు అడుగులగా ఉండేది. దాన్ని 5 లక్షల చదరపు అడుగులకు పెంచుతున్నారు.

4. మోదీ తన పర్యటనలో భాగంగా కాశీ విశ్వనాధుడి కారిడార్ ప్రాజెక్టులో పనిచేస్తున్న భవననిర్మాణ కార్మికులతో కలిసి భోజనం చేశారు. ఆ ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులపై మోదీ పూలను చల్లి గౌరవించారు.

5. మోదీ యూపీ సీఎం యోగీ ఆదిత్యనాధ్ తో కలిసి వారణాసిలోని రవిదాస్ ఘాట్ లో షికారు చేశారు. ఇద్దరు నేతలను చూసిన వాళ్ళ మద్దతుదారులు కేరింతలు కొట్టారు, నినాదాలు ఇచ్చారు.

6. వారణాసిలోని దశశవమేద్ ఘాట్ లో గంగా హారతి కార్యక్రమంలో భాగమయ్యారు. ఈ కార్యక్రమంలో మోదీతో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. ఆ సమయంలో వారణాసిలోని మిగతా ప్రాంతాల్లో భారీగా క్రాకర్స్ కాల్చారు.

7. మోదీ యూపీ సీఎం ఆదిత్యనాధ్ తో కలిసి అర్ధరాత్రి వారణాసి వీధుల్లో పర్యటించారు. బెనారస్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ ఫారంపై నడుచుకుంటూ అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం.

8. రెండవరోజు పర్యటనలో భాగంగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు 9 రాష్ట్రాల ఉపముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

9. స్వర్వేద్ మహామందిరంలో జరిగిన సద్గురు సదఫల విహంగ యోగ్ సంస్థాన్ 98వ వార్షికోత్సవ వేడుకల్లో మోదీ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో సాధువులు తమవంతు సహకారం అందించారని అయితే ఆ చరిత్రను సరిగా నమోదు చేయలేదని తెలిపారు.

10. కాశీలో జరిగిన మెగా ర్యాలీలో మోదీ ప్రసంగించారు. 2014-15తో పోలిస్తే 2019-20లో వారణాసికి వచ్చే పర్యాటకుల సంఖ్య రెట్టింపు అయిందని మోదీ తెలిపారు. వారణాసిలో చేస్తున్న చేయబోయే అభివృద్ధి పనులను మోదీ వివరించారు.