Site icon HashtagU Telugu

Gujarat : కేజ్రీవాల్ సభలో మోదీ నినాదాలు…అవాక్కయిన ఆప్ చీఫ్..!!

Kejriwal

Kejriwal

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తూ బిజీగా ఉన్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆదివారం గుజరాత్ లో కేజ్రివాల్ రోడ్డు షో నిర్వహించారు. అయితే రోడ్డు షోలో కొంతమంది ప్రధాని మోదీకి అనుకూలంగా నినాదాలు చేశారు. మోదీ మోదీ అంటూ గట్టిగా అరిచారు. పంచమహాల్ జిల్లాలోని హలోల్ లో జరిగింది. దీనిపై కేజ్రివాల్ కూడా ఘాటుగానే సమాధానం ఇచ్చారు. మీరు ఎవరికి అనుకూలంగా అయినా సరే నినాదాలు చేయవచ్చన్నారు. నేను మీ పిల్లలకు పాఠశాలలు నిర్మిస్తాను…ఉచిత విద్యుత్ అందిస్తానని చెప్పారు.

మోదీకి అనుకూలంగా నినాదాలు చేసే వారి గుండెల్లో ఆమ్ ఆద్మీ తప్పకుండా ఉంటుందన్నారు. ఎవరితోనూ ఎలాంటి శత్రూత్వం లేదన్నారు. మీకు నచ్చినవారికి అనుకూలంగా నినాదాలు చేసుకోవచ్చు. కాగా రాష్ట్రంలో పెద్దసంఖ్యలో యువత నిరుద్యోగులుగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుచేస్తూ బీజేపీ పై తీవ్ర విమర్శలు చేశారు కేజ్రివాల్.

Exit mobile version