PM Modi Gifts : క్వాడ్ దేశాల కూటమి సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమెరికాలోని డెలావర్ రాష్ట్రానికి వెళ్లారు. ఆ రాష్ట్రంలోని విల్మింగ్టన్ పట్టణమే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వస్థలం. అక్కడికి వెళ్లిన మోడీ.. బైడెన్‌తో భేటీ అయ్యారు. ఈసందర్భంగా బైడెన్‌కు మోడీ కొన్ని ప్రత్యేక బహుమతులను అందజేశారు. పురాతన వెండి రైలు మోడల్‌ను బైడెన్‌కు కానుకగా ఇచ్చారు. దీని ప్రధాన క్యారేజ్ వైపు ఢిల్లీ టు డెలావేర్ అని రాసి ఉంది. ఇంజిన్ వైపు ఇండియన్ రైల్వేస్ అని ఇంగ్లీషు, హిందీ లిపిలో రాసి ఉంది. ఈ రైలు నమూనాను మహారాష్ట్రకు చెందిన హస్త కళాకారులు తయారు చేశారు. సిల్వర్‌తో తయారు చేసిన ఆ రైలు నమూనా అట్రాక్టివ్‌గా ఉంది. దీని తయారీకి 92.5 శాతం వెండిని వాడారు. చెక్కడం, రిపౌస్సే అనే సుత్తిపని, ఫిలిగ్రీ వంటి పద్ధతుల్లో ఈ రైలు మోడల్‌ను(PM Modi Gifts) తయారు చేశారు.
PM Modi Gifts : జో బైడెన్, జిల్ బైడెన్‌లకు ప్రధాని మోడీ ప్రత్యేక గిఫ్ట్స్ ఇవే..
