Morbi bridge collapse : అహ్మదాబాద్ లో ఇవాళ జరగాల్సిన మోదీ రోడ్ షో రద్దు..మోర్బీ ఘటనాస్థలానికి మోదీ..?

  • Written By:
  • Publish Date - October 31, 2022 / 06:31 AM IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గుజరాత్, రాజస్థాన్ లో పర్యటనలో ఉన్నారు. మూడు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో మోదీ పర్యటించనున్నారు. అయితే ఆదివారం గుజరాత్ లో మోర్బీ నదిపై కేబుల్ వంతెన కూలిపోయిన ఘటనలో వంద మందికి పైగానే మరణించారు. మోర్బీ వంతెన ప్రమాదం ద్రుష్ట్యా సోమవారం అహ్మదాబాద్ లో జరగాల్సిన రోడ్ షోను రద్దు చేయాలని మోదీ నిర్ణయించారు. రోడ్ షో పాటు మిగతా కార్యక్రమాలను కూడా రద్దు చేసినట్లు గుజరాత్ బీజేపీ మీడియా కన్వీనర్ డాక్టర్ యాగ్నేష్ దవే వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని నవంబర్ 1కి వాయిదా వేసినట్లు తెలిపారు. మోర్బీ దుర్ఘటన నేపథ్యంలో సోమవారం ఎలాంటి రోడ్డు షోలు ఉండవన్నారు. కానీ 2900కోట్ల రైల్వే ప్రాజెక్టులను అంకితం చేసే కార్యక్రమం మాత్రం జరుగుతుందన్నారు.

ఇక మోర్బీ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మోర్బీ ఘటన కలచివేసిందన్నారు కేంద్రహోం శాఖమంత్రి అమిత్ షా. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. ఈ విషయంపై గుజరాత్ హోంశాఖ మంత్రితో మాట్లాడినట్లు తెలిపారు.క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మోర్జీ ఘటనపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాందీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరం అన్నారు. భగవంతుడు వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాని ట్వీట్ చేశారు.

వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ప్రమాదం పై విచారం వ్యక్తం చేశారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు.

ఈ ఘటనలో మరణించిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2లక్షలు, గాయపడినవారికి 50వేల చొప్పున పీఎం రిలీఫ్ పండ్ నుంచి మోదీ పరిహారంగా ప్రకటించారని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిహారం ప్రకటించింది. మరణించినవారి కుటుంబాలకు నాలుగు లక్షలు, గాయపడిన వారికి 50వేలు అందజేస్తామని ప్రకటించింది.