PM Modis Portrait : రేపు (సెప్టెంబరు 17న) ప్రధానమంత్రి నరేంద్రమోడీ పుట్టిన రోజు. ఈసందర్భంగా 13 ఏళ్ల స్కూలు విద్యార్థిని 800 కేజీల మిల్లెట్లతో ప్రధాని మోడీ చిత్రాన్ని గీసింది. 12 గంటల పాటు నాన్ స్టాప్‌గా శ్రమించి ఈ పెయింటింగ్‌ను ఆమె తీర్చిదిద్దింది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద మిల్లెట్ చిత్రాన్ని గీసిన రికార్డును ప్రెస్లీ షెకీనా సొంతం చేసుకుంది. ఆమె చెన్నైలోని కోల్ పక్కం ఏరియా వాస్తవ్యురాలు. ప్రతాప్ సెల్వం, సంకీరాణి దంపతుల కుమార్తె ప్రెస్లీ షెకీనా. ప్రస్తుతం షెకీనా ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది.
Also Read :Elon Musk : కమల, బైడెన్‌లను హత్య చేసేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదు : ఎలాన్ మస్క్
తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తాను ఈ పెయింటింగ్ గీశానని షెకీనా(PM Modis Portrait) తెలిపారు. దాదాపు 600 చదరపు అడుగుల స్థలంలో ఈ మోడీ చిత్రం ఉందన్నారు. ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి ఆదివారం రాత్రి 8.30 గంటల వరకు శ్రమించి ఈ చిత్రాన్ని గీసినట్లు షెకీనా వివరించింది. ప్రధాని మోడీకి ఈవిధంగా క్రియేటివ్‌గా తాను బర్త్‌డే విషెస్ చెబుతున్నట్లు తెలిపింది. ఈ రికార్డును యూనికో వరల్డ్ రికార్డ్ సంస్థ గుర్తించింది. విద్యార్థుల అఛీవ్‌మెంట్స్ కేటగిరీలో ఈ రికార్డును నమోదు చేసినట్లు యూనికో వరల్డ్ రికార్డ్ తెలిపింది. వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్, మెడల్‌ను షెకీనాకు ప్రదానం చేసినట్లు పేర్కొంది. ఈసందర్భంగా షెకీనాకు ఆమె చదువుతున్న స్కూలు సిబ్బంది, తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు.
Also Read :Trump Golf Course: ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం.. నిందితుడు ఎవరంటే ?
మోడీ బర్త్ డే సందర్భంగా .. రేపు కాశీలో సీఎం యోగి ప్రత్యేక పూజలు
రేపు ప్రధాని మోడీ బర్త్ డే సందర్భంగా యూపీలోని కాశీ విశ్వనాథుడి ఆలయంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రత్యేక పూజలతో పాటు రుద్రాభిషేకాన్ని ఆయన నిర్వహిస్తారు. ఈవివరాలను బీజేపీ కాశీ రీజియన్ అధికార ప్రతినిధి నవరతన్ రాఠీ వెల్లడించారు. ఇవాళ సాయంత్రంకల్లా సీఎం యోగి వారణాసికి చేరుకుంటారని తెలిపారు. ప్రధాని మోడీ పుట్టిన రోజును పురస్కరించుకొని యూపీలోని అన్ని జిల్లాల్లో సేవా పఖ్వాడా కార్యక్రమాన్నిసెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 2 వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా బీజేపీ కార్యకర్తలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మహనీయుల విగ్రహాలు, చారిత్రక ప్రదేశాలు, దేవాలయాలను శుభ్రం చేస్తారు.