Site icon HashtagU Telugu

PM Modi: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫ‌లితాల‌పై ప్ర‌ధాని మోదీ స్పంద‌న ఇదే!

PM Modi

PM Modi

PM Modi: బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుది చిత్రం దాదాపుగా స్పష్టమైంది. ఎన్డీఏ కూటమికి మొత్తం 202 స్థానాల్లో భారీ విజయం దక్కింది. ఇందులో భారతీయ జనతా పార్టీ (BJP) 91 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్డీఏకు దక్కిన ఈ ప్రజా తీర్పుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తొలిసారిగా స్పందించారు. ఈ విజయాన్ని సుపరిపాలన, అభివృద్ధి విజయంగా అభివర్ణించిన ఆయన బీహార్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

పీఎం మోదీ ఎక్స్ (X) పోస్ట్

ప్రధానమంత్రి మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) ద్వారా పోస్ట్ చేస్తూ “ఇది సుపరిపాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమ భావన, సామాజిక న్యాయం విజయం. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏకు చారిత్రక, అపూర్వ విజయాన్ని ఆశీర్వదించిన బీహార్‌లోని నా కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ అఖండ ప్రజా తీర్పు, ప్రజలకు సేవ చేయడానికి.. బీహార్ కోసం కొత్త సంకల్పంతో పనిచేయడానికి మాకు శక్తినిస్తుంది” అని పేర్కొన్నారు.

Also Read: Govt Scheme: ప్రతినెలా రూ. 5,000 నుండి రూ. 10,000 పెట్టుబడి పెడితే 18 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు?

పీఎం మోదీ తన పోస్ట్‌లో మరింతగా “అలుపెరగని కృషి చేసిన ఎన్డీఏ కార్యకర్తలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. వారు ప్రజల్లోకి వెళ్లి అభివృద్ధి ఎజెండాను వివరించారు. ప్రతిపక్షాల ప్రతి అబద్ధానికి సరైన సమాధానం ఇచ్చారు” అని కొనియాడారు.

మళ్లీ నితీష్ నాయకత్వంలోనే సర్కార్?

బీహార్‌లో 243 మంది సభ్యులు గల అసెంబ్లీకి మెజారిటీ సంఖ్య 122. ఎన్డీఏ కూటమి ఈ సంఖ్య కంటే చాలా ఎక్కువ సీట్లలో ఆధిక్యాన్ని ప్రదర్శించి విజయాన్ని ఖరారు చేసుకుంది. ఈ ఫలితాలతో నితీష్ కుమార్ నాయకత్వంలో మరోసారి బీహార్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అయితే బీహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై మాత్రం ఎమ్మెల్యేల బృందం సమావేశంలో తుది నిర్ణయం తీసుకోబడుతుంది.

Exit mobile version