Site icon HashtagU Telugu

Rahul Gandhi : గెలిచేది మేమే.. అవి మోడీ పోల్స్‌ : రాహుల్ గాంధీ

Rahul Gandhi Modi

Rahul Gandhi Modi

Rahul Gandhi : ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. అవి ఎగ్జిట్ పోల్స్ కాదని..మోడీ పోల్స్ అని ఆయన కామెంట్ చేశారు.సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించబోతోందని రాహుల్ జోస్యం చెప్పారు. 295కిపైగా సీట్లు ఇండియా కూటమికి వస్తాయన్నారు. ఎన్నికల ఫలితాలు జూన్ 4న రిలీజ్ అవుతాయి. ఆ రోజున జరగనున్న ఇండియా కూటమి సమావేశంపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రాహుల్ ఇవాళ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీడియాను తమ వైపు తిప్పుకొని ఇష్టానుసారంగా ఎగ్జిట్ పోల్స్‌ను బీజేపీ రిలీజ్ చేయించిందని రాహుల్(Rahul Gandhi) మండిపడ్డారు.

We’re now on WhatsApp. Click to Join

ఇక ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలపై సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ నిప్పులు చెరిగారు. ఎగ్జిట్ పోల్స్‌ను వాడుకొని సోమవారం ప్రారంభమయ్యే షేర్ మార్కెట్ నుంచి లబ్ధి పొందాలని బీజేపీ కీలక నేతలు భావిస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల తర్వాత బీజేపీ నాయకులను నిరాశ ఆవరించిందన్నారు. ఆ నిరాశను పోగొట్టుకునేందుకే ఎగ్జిట్ పోల్స్‌ పాజిటివ్‌గా వచ్చేలా చేసుకున్నారని అఖిలేష్  విమర్శించారు. ఎన్నికల కౌంటింగ్ రోజున ఈవీఎంలను నిశితంగా చెక్ చేయాలని ఇండియా కూటమి పార్టీలకు ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ అనుకూల మీడియా ఇష్టానుసారంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : 70 Terrorists : చొరబాటుకు 70 మంది ఉగ్రవాదులు రెడీ : కశ్మీర్ డీజీపీ

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ ‘కార్పొరేట్ గేమ్’గా అభివర్ణించారు.కొన్ని సంస్థలు డబ్బులు ఇచ్చిన పార్టీలకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేశాయన్నారు. డబ్బు చేతిలో ఉంటే ఎగ్జిట్ పోల్స్ ద్వారా సొంత లెక్కలను రిలీజ్ చేయించే సత్తా వస్తుందని ఆయన విమర్శించారు. ఇండియా కూటమికి ఈ ఎన్నికల్లో దాదాపు  295 నుంచి 310 సీట్లు వస్తాయని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ సంస్థల యజమానులంతా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. బెదిరింపులకు పాల్పడి ఎన్నికల్లో గెలవలేరని బీజేపీకి సంజయ్ రౌత్ హితవు పలికారు.

Also Read : Pied Cuckoo: పైడ్ కోకిల దర్శనం.. ఋతుపవనాల ఆగమనాని సూచన..!