Site icon HashtagU Telugu

PM Modi: ప్రధాని మోదీతో తొలి భారతీయ అంతరిక్షయాత్రికుడు శుభాన్షు శుక్లా సంభాషణ

Pm And Shukla

Pm And Shukla

న్యూఢిల్లీ: PM Modi: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడు, భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖాముఖి సంభాషించారు. ఈ సందర్భంగా శుభాన్షు తన అంతరిక్ష ప్రయాణ అనుభవాలను ప్రధానికి వివరించారు.

ఈ సంభాషణను ప్రధాని మోదీ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పంచుకుంటూ – “ఇది ఒక అద్భుతమైన సంభాషణ” అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మోదీ మరియు శుభాన్షు మధ్య జరిగిన చర్చ వీడియో రూపంలో కూడా షేర్ చేశారు.

ఈ సందర్భంలో శుభాన్షు శుక్లా మాట్లాడుతూ – “ఇది సాధ్యపడినది మా దేశ ప్రజల ప్రేమ, ఆశీర్వాదాల వల్లే. భారతీయుల ప్రేమే నన్ను అంతరిక్ష కేంద్రానికి సురక్షితంగా తీసుకువచ్చింది” అని పేర్కొన్నారు. తన తోటి దేశస్థులకు హిందీలో సందేశం అందించిన శుభాన్షు, తాను దేశ ప్రజల ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేనని పేర్కొన్నారు.