Kaziranga Park : కజిరంగా నేషనల్ పార్కులో ఏనుగు పై ప్రధాని మోడీ సఫారీ

  PM Modi in Kaziranga Park : అస్సాం(assam)లో ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పర్యటిస్తున్నారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అస్సాం పర్యటనలో భాగంగా శనివారం ఉదయం మోడీ కజిరంగా నేషనల్ పార్కు(kaziranga national park)ను సందర్శించారు. అక్కడి పార్కులో పరిసరాలను మోడీ ఆస్వాదించారు. కెమెరా చేత పట్టుకొని పలు జంతువుల చిత్రాలను క్లిక్ చేశారు. 1957 తరువాత కజిరంగా పార్క్ ను సందర్శించిన తొలి ప్రధాని మోడీ కావడం […]

Published By: HashtagU Telugu Desk
Pm Modi Visits Kaziranga Na

Pm Modi Visits Kaziranga Na

 

PM Modi in Kaziranga Park : అస్సాం(assam)లో ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పర్యటిస్తున్నారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అస్సాం పర్యటనలో భాగంగా శనివారం ఉదయం మోడీ కజిరంగా నేషనల్ పార్కు(kaziranga national park)ను సందర్శించారు. అక్కడి పార్కులో పరిసరాలను మోడీ ఆస్వాదించారు. కెమెరా చేత పట్టుకొని పలు జంతువుల చిత్రాలను క్లిక్ చేశారు. 1957 తరువాత కజిరంగా పార్క్ ను సందర్శించిన తొలి ప్రధాని మోడీ కావడం విశేషం.

We’re now on WhatsApp. Click to Join.

కజిరంగా నేషనల్ పార్క్ కు వెళ్లిన ప్రధాని మోడీ ఏనుగుపై సఫారీ (Elephant Ride) చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతరం ఓపెన్ టాప్ జీప్ పై పర్యటించిన ప్రధాని.. పార్కులోని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించారు. నేషనల్ పార్క్ డైరెక్టర్ సోనాలి ఘోష్, అటవీ శాఖ చెందిన ఉన్నతాధికారులు కూడా ప్రధాని మోడీతో ఏనుగులపై సఫారీలో పాల్గొన్నారు. ఇదిలాఉంటే.. 1957లో కజిరంగ జాతీయ పార్కుకు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతంగా గుర్తింపు లభించిన తర్వాత దేశ ప్రధాని అక్కడ పర్యటించడం ఇదే మొదటిసారి.

read also : LPG Cylinders: నేటి నుంచి ఎల్‌పీజీ సిలిండర్ల కొత్త ధ‌ర‌లు.. హైద‌రాబాద్‌లో గ్యాస్‌ రేట్ ఎంతంటే..?

 

  Last Updated: 09 Mar 2024, 10:29 AM IST