PM Modi: నేడు గుజరాత్‌లో పర్యటించనున్న పీఎం మోదీ.. ప్రధాని పూర్తి షెడ్యూల్ ఇదే..!

దాదాపు రూ.4,400 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించేందుకు, 19,000 మంది లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ పథకం కింద నిర్మించిన ఇళ్లను కేటాయించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శుక్రవారం గుజరాత్‌ (Gujarat)లో పర్యటించనున్నారు.

  • Written By:
  • Publish Date - May 12, 2023 / 08:11 AM IST

PM Modi: దాదాపు రూ.4,400 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించేందుకు, 19,000 మంది లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ పథకం కింద నిర్మించిన ఇళ్లను కేటాయించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శుక్రవారం గుజరాత్‌ (Gujarat)లో పర్యటించనున్నారు. గాంధీనగర్‌లో జరిగే ‘ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ యూనియన్ కన్వెన్షన్’కు మోదీ హాజరవుతారని, గిఫ్ట్ సిటీని కూడా సందర్శిస్తారని ప్రధాని కార్యాలయం (పీఎంవో) విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. గాంధీనగర్‌లో జరిగే కార్యక్రమంలో మోదీ రూ. 2,450 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని ప్రకటనలో తెలిపారు.

ఈ ప్రారంభోత్సవాలలో పట్టణాభివృద్ధి శాఖ, నీటి సరఫరా శాఖ, రోడ్డు మరియు రవాణా శాఖ, గనులు మరియు ఖనిజాల శాఖ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ, పట్టణ) లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందజేయనున్నారు. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ.1,950 కోట్లు.

రాష్ట్ర ఉపాధ్యాయులను కూడా కలుస్తారు

గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ (గిఫ్ట్ సిటీ) పర్యటన సందర్భంగా అక్కడ కొనసాగుతున్న వివిధ ప్రాజెక్టుల స్థితిగతులను మోదీ సమీక్షిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ సమయంలో మోదీ అధికారులతో కూడా ఇంటరాక్ట్ అవుతారు. వారి అనుభవం, భవిష్యత్తు ప్రణాళికలను అర్థం చేసుకుంటారు. ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ యూనియన్ కన్వెన్షన్ అనేది ఆల్ ఇండియా ప్రైమరీ టీచర్స్ ఫెడరేషన్ 29వ ద్వైవార్షిక సదస్సు. ఈ సదస్సు థీమ్ టీచర్స్ ఎట్ ది సెంటర్ ఆఫ్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఎడ్యుకేషన్.

Also Read: Karnataka Election: ఆ ఈవీఎంలన్నీ కొత్తవే.. కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చిన ఎన్నికల సంఘం..!

ప్రధాని మోదీ షెడ్యూల్ ఇదే

– మే 12న ప్రధాని ఉదయం 10 గంటలకు అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
– గిఫ్ట్ సిటీలో ఉదయం 11 గంటలకు ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం జాతీయ సదస్సుకు హాజరవుతారు.
– మధ్యాహ్నం 12 గంటలకు మహాత్మా మందిరంలో అమృత్ ఉత్సవ్‌లో పాల్గొంటారు.
– ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రూ.1946 కోట్ల విలువైన 42 వేలకు పైగా గృహాలను ప్రారంభించి, గృహ ప్రవేశ కార్యక్రమంలో చేర్చనున్నారు.
– ప్రధాన మంత్రి పట్టణ ప్రాంతాల్లో 7113 హౌసింగ్ యూనిట్లను, గ్రామీణ ప్రాంతాల్లో 12,000 హౌసింగ్ యూనిట్లను ప్రారంభిస్తారు.
– మహాత్మా మందిరం నుంచి ప్రధాని రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు.
– రాజ్‌భవన్‌లో సీఎం సహా ఇతర అధికారులు, సంస్థ ఆఫీస్ బేరర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ప్రధాని సమావేశం కానున్నారు.
– ప్రధాని మోదీ మధ్యాహ్నం 3 గంటలకు గిఫ్ట్ సిటీకి వెళ్లనున్నారు.
– గిఫ్ట్ సిటీలో వివిధ కంపెనీల సీఈవోలు, వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో ఆయన సమావేశం కానున్నారు.
– సాయంత్రం 5 గంటలకు GIFT సిటీ నుండి అహ్మదాబాద్ విమానాశ్రయానికి బయలుదేరతారు.
– తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు.